AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి నేరుగా రూ.15 వేలు..

మీరు కొత్తగా చేరాలా..? మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? వరుసగా ఏడాది పాటు ఒకే కంపెనీలో పని చేశారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15 వేల ఆర్ధిక సాయం పొందవచ్చు. దీని కోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

Venkatrao Lella
|

Updated on: Oct 21, 2026 | 5:30 PM

Share
ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం అద్బుత స్కీమ్ అమలు చేస్తోంది. కొత్తగా ఉద్యోగంలో చేరి పీఎఫ్ అకౌంట్ పొందినవారి కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకం ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోంది. కొత్త ఉద్యోగులకు తొలి ఏడాది రూ.15 వేలు ఆర్ధిక సాయం పంపిణీ చేస్తోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఈ స్కీమ్ వర్తిపంచేస్తోంది. కొత్తగా ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరి పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటేనే ఈ పథకానికి అర్హులవుతారు.

1 / 5
నూతనంగా జాబుల్లో చేరేవారిని ప్రోత్సహించడం, ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఉద్యోగంలో చేరగానే ఆటోమేటిక్‌గా ఈ నగదు అందదు. అర్హతలు, నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఆరు నెలల పాటు ఒకే సంస్థలో పని చేసి ఉండాలి. పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ వరుసగా ఆరు నెలల పాటు జమ అయి ఉండాలి.

2 / 5
ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే ఉద్యోగులకు జీతం నెలకు రూ.లక్ష కంటే తక్కువగా ఉండాలి. ఆపైన శాలరీ ఉన్నవారు అర్హులు కాదు. ఆగస్ట్ 2025 నుంచి జులై 31,2027 మధ్య కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి వర్తిస్తుంది. 2025కి ముందు ఉద్యోగంలో చేరివారు అనర్హులు అవుతారు. ఈ రెండు విడతలుగా రూ.15 వేలు ఆర్ధిక సాయాన్ని అందిస్తారు.

3 / 5
పీఎఫ్‌లో ఆరు నెలల వరుస సర్వీస్ తర్వాత తొలి విడత నగదు జమ చేస్తారు. ఇక వరుసగా 12 నెలల సర్వీస్ తర్వాత రెండో విడత విడుదల చేస్తారు. వీటిని నేరుగా ఉద్యోగి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. పీఎఫ్ అకౌంట్లో పొందుపర్చిన బ్యాంక్ ఖాతాలో ఆటోమేటిక్‌గా జమ అవుతాయి. ఈ పథకం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

4 / 5
తొలి విడత కింద రూ.7500 అకౌంట్లో పడతాయి. ఇక రెండో విడత కింద రూ.7500 పంపిణీ చేస్తారు. ఇక పథకం కింద ఉద్యోగం కల్పించిన కంపెనీకి కూడా కేంద్రం సాయం అందిస్తోంది. ప్రతీ ఉద్యోగిపై రూ.3 వేల చొప్పున వరుసగా రెండేళ్ల  పాటు యజమానులకు ప్రోత్సాహకం అందిస్తోంది. ఉద్యోగాల కల్పనను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

5 / 5
Follow Us