AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్‌, విజయవాడలో నేటి పసిడి, వెండి ధరలు ఇవే

Gold Rate Today: అక్టోబర్ 20న బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,050కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,710కు చేరింది. వెండి ధరల్లోనూ మార్పులు కనిపించాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోండి.

బంగారం కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్‌, విజయవాడలో నేటి పసిడి, వెండి ధరలు ఇవే
Gold Prices
Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2026 | 6:36 AM

Share

గత కొంతకాలం నుంచి బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. సౌదీ-హౌతీల పరస్పర దాడులు.. ఇలా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.. కాగా.. ఇటీవల పెరిగిన ధరలు.. కాస్త తగ్గి ఊరటనిస్తున్నాయి.. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం అక్టోబర్ 20 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. తాజాగా.. స్వల్పంగా ధరలు పెరిగాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర పెరిగి.. రూ.1,48,050 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 పెరిగి.. రూ.1,35,710 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,29,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,050, 22 క్యారెట్ల ధర రూ.1,35,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,48,050 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,200, 22 క్యారెట్ల ధర రూ.1,35,860 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,050, 22 క్యారెట్ల ధర రూ.1,35,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,050, 22 క్యారెట్ల ధర రూ.1,35,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,48,050, 22 క్యారెట్ల ధర రూ.1,35,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us