AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే?

Tenali suicide case: నెల్లూరు నుంచి తెనాలికి వలస వచ్చిన ప్రేమ జంట తేజ, షన్నూల జీవితం విషాదాంతమైంది. భార్య షన్నూపై వివాహేతర సంబంధం అనుమానంతో తరచు గొడవపడే తేజ, మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తేజ మరణాన్ని హత్యగా అనుమానిస్తున్న అతని బంధువులు, షన్నూ ఆమె ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే?
Tenali Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 23, 2026 | 6:03 PM

Share

ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఊరు కాని ఊరు వచ్చి జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఆ అమ్మాయి ప్రవర్తనపై అతనికి అనుమానం మొదలైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు భావించిన అతను ఆమెతో తరచూ ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను బ్రతిమలాడుకొని కాపురానికి తెచ్చుకున్నాడు. అయినా అతని తీరు మారలేదు. మద్యం మత్తులో ఘర్షణ పడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అతని బంధువులు మాత్రం ఆమె అతని ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు.

నెల్లూరుకు చెందిన తేజ, షన్నూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. నెల్లూరులో ఉండలేక తెనాలి వచ్చి జీవిస్తున్నారు. గత నాలుగేళ్లుగా యడ్ల లింగయ్య కాలనీలో ఉంటున్నారు. సమోస విక్రయిస్తూ తేజ, క్యాటరింగ్ పనులకూ వెళుతూ షన్నూ నివసిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే షన్నూ ప్రవర్తనపై తేజాకు అనుమానం ఏర్పడింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేజ అనుమానించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పెద్దవి కావడంతో భర్తను వదిలి పెట్టి షన్నూ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత తేజ వాళ్లింటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులను ఒప్పించి తెనాలికి తీసుకొచ్చాడు. అయినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు.

రెండు రోజుల క్రితం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ మద్యం సేవించారు. మద్యం మత్తులోనే షన్నూ బయటకు వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిందన్న కోపంతో తేజ మద్యం మత్తులోనే ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన షన్ను.. భర్త తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి చూడగా తేజ ఉరివేసుకుని ఉన్నాడు. చుట్టు పక్కల వాళ్ల సాయంతో ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే తేజ చనిపోయి ఉన్నాడు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్లే తేజ తల్లికి, బంధువులకు చెప్పారు. తెనాలి వచ్చిన బంధువులు షన్ను ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షన్ను ఆమె ప్రియుడు కలిసే తేజాను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

Follow Us