AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత కాలం చిట్కా.. ఇదొక్కటి వేస్తే.. ఎంత ముదురు మటన్ అయినా మెత్తగా ఉడకాల్సిందే..

మటన్ ఎంత ముదురుగా ఉన్నా నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా చేయడానికి పచ్చి బొప్పాయి సహజ మీట్ టెండరైజర్‌గా అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే 'పపైన్' ఎంజైమ్ మాంసంలోని కండరాలను మెత్తబరచి తక్కువ సమయంలోనే సాఫ్ట్‌గా ఉడికేలా చేస్తుంది. ఈ సింపుల్ టిప్‌తో పాటు విలేజ్ స్టైల్ మసాలాలతో మటన్ కర్రీ వండితే ఘుమఘుమలాడే రుచి, చిక్కటి గ్రేవీ, జ్యూసీ ముక్కలతో ప్రతి ముద్ద ప్రత్యేకంగా ఉంటుంది.

పాత కాలం చిట్కా.. ఇదొక్కటి వేస్తే.. ఎంత ముదురు మటన్ అయినా మెత్తగా ఉడకాల్సిందే..
Mutton
Shaik Madar Saheb
|

Updated on: Jul 21, 2026 | 12:26 PM

Share

నాన్ వెజ్ ప్రియుల్లో మటన్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. మటన్ ను పలు రకాలుగా వండుకుని ఆరగిస్తారు. ముఖ్యంగా పండుగల వేళల్లో అలాగే.. పంక్షన్లలో మటన్ స్పెషల్ కర్రీని వండుతారు.. అయితే.. బోనాలు సందర్భంగా చాలా మంది పొట్టెళ్లను, మేకపోతులను బలిఇస్తారు. అయితే.. మటన్ వండేటప్పుడు చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మాంసం సరిగ్గా ఉడకకపోవడం లేదా గట్టిగా ఉండటం. ముఖ్యంగా ముదురు మటన్ (మేక మాంసం) అయితే ఎంత విజిల్స్ వేయించినా కొన్నిసార్లు గట్టిగానే ఉంటుంది. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా.. ముదురు మటన్ ముక్క అయినా సరే నోట్లో వేస్తే కరిగిపోయేలా, దూదిలా మెత్తగా ఉడికించుకోవచ్చు.. ఈ అద్భుతమైన చిట్కాను.. ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ మటన్ కర్రీ తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

ముదురు మటన్ మెత్తగా ఉడకడానికి సీక్రెట్ టిప్:

మటన్ ముక్కలు త్వరగా, సాఫ్ట్ గా ఉడకడానికి సహజసిద్ధమైన మీట్ టెండరైజర్ (Meat Tenderizer) గా పచ్చి బొప్పాయి ముక్క లేదా బొప్పాయి పేస్ట్ (Raw Papaya Paste) అద్భుతంగా పనిచేస్తుంది. మటన్‌ను వండటానికి ముందు లేదా మ్యారినేషన్ చేసేటప్పుడు కొద్దిగా పచ్చి బొప్పాయి తురుము లేదా పేస్ట్‌ను ముక్కలకు పట్టించి ఒక 20-30 నిమిషాలు పక్కన పెట్టాలి. బొప్పాయిలో ఉండే ‘పపైన్’ (Papain) అనే ఎంజైమ్ ముదురు మాంసంలోని కండరాలను లూజ్ చేసి, ముక్కను ఎంతో జ్యూసీగా, మెత్తగా మార్చేస్తుంది.

పచ్చి బొప్పాయి పేస్ట్‌ను ఎక్కువసేపు లేదా అధిక మోతాదులో ఉపయోగిస్తే మటన్ మరీ మెత్తగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మాంసం పరిమాణానికి తగినంత మాత్రమే వేసి 20–30 నిమిషాల పాటు మ్యారినేట్ చేయడం సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

కావలసిన పదార్థాలు:

  • మటన్
  • పచ్చి బొప్పాయి పేస్ట్ ( మటన్ పరిమాణాన్ని బట్టి కొంచెం చాలు)
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటోలు – 2 (సన్నని ముక్కలు లేదా ప్యూరీ)
  • నూనె, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా లేదా మటన్ మసాలా పొడి, హోల్ గరం మసాలా దినుసులు – బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా – కొద్దిగా

మటన్ కర్రీ తయారీ విధానం:

మ్యారినేషన్ (Marination): మొదట శుభ్రంగా కడిగిన మటన్ ముక్కల్లో కొంచెం పచ్చి బొప్పాయి పేస్ట్, ఉప్పు, పసుపు,, కారం, కొంచెం నూనె వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టించాలి. దీన్ని కనీసం 20-30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ సమయంలోనే మటన్ ముక్కలు మెత్తబడటం స్టార్ట్ అవుతాయి.

పోపు వేయడం: స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ లేదా మందపాటి కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక హోల్ గరం మసాలా దినుసులు (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు) వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

మసాలాలు వేయించడం: ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించాలి. అనంతరం సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి, టమోటోలు మెత్తగా గుజ్జులా అయ్యే వరకు మగ్గించుకోవాలి.

మటన్ ఉడికించడం: టమోటోలు మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను ఇందులో వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి 5-7 నిమిషాల పాటు మటన్‌ను బాగా కలుపుతూ వేయించాలి. దీనివల్ల మటన్ లోంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీరంతా కొద్దిగా ఇగిరిపోయే వరకు ఉంచాలి.

ఆ తర్వాత మిగిలిన కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కూరకు సరిపడా నీళ్లు (సుమారు ఒకరిన్నర గ్లాసు) పోసి, పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర చల్లాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 నుండి 5 విజిల్స్ రానివ్వాలి (బొప్పాయి వేసాం కాబట్టి 4 విజిల్స్ లోనే ముదురు మటన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది).

కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి, చివరగా గరం మసాలా పొడి చల్లి, గ్రేవీ చిక్కదనాన్ని బట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే.. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఎంతో రుచికరమైన, మెత్తటి మటన్ కర్రీ సిద్ధమవుతుంది.

ఈ పద్ధతిలో వండటం వల్ల ముక్కలు పీచు పీచుగా లేకుండా ఎంతో సాఫ్ట్ గా, జ్యూసీగా తయారవుతాయి. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ఎవరైనా సరే ఈ మటన్ ముక్కలను ఎంతో సులభంగా నమిలి తినవచ్చు. అన్నం, రాగి సంకటి లేదా చపాతీల్లోకి ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us