AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur : అతడితో పిచ్చిగా ప్రేమలో ఉన్నా.. ఆ హీరో నా జీవితంలో లేడనే విషయం గుండెను ముక్కలు చేస్తుంది.. మృణాల్..

ఓ స్టార్ హీరో పట్ల తనకున్న అమితమైన ప్రేమను కథానాయిక మృణాల్ ఠాకూర్ బహిరంగంగా వ్యక్తం చేశారు. ఆయన తెరపై పండించే రొమాన్స్ వల్ల నిజ జీవితంలో లవ్ బెంచ్ మార్క్ చాలా పెరిగిపోయిందని, ఆయన తన జీవితంలో లేరనే నిజం గుర్తుకువస్తేనే గుండె ముక్కలవుతుందంటూ ఆమె చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Mrunal Thakur : అతడితో పిచ్చిగా ప్రేమలో ఉన్నా.. ఆ హీరో నా జీవితంలో లేడనే విషయం గుండెను ముక్కలు చేస్తుంది.. మృణాల్..
Mrunal Thakur
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2026 | 7:34 AM

Share

తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో తన అభినయంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్. బుల్లితెరపై సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు కథానాయికగా తనదైన నటనతో హృదయాలను గెలుచుకున్న కథానాయిక మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ, నిత్యం తన నటనతో , గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్, బాలీవుడ్ ‘బాద్‌షా’ షారూఖ్ ఖాన్ పై తనకున్న అమితమైన ప్రేమను, అభిమానాన్ని మనసు విప్పి బయటపెట్టారు. ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచీ నాకు షారూఖ్ ఖాన్ అంటే విపరీతమైన ప్రేమ. ఆయన తెరపై చేసే రొమాన్స్, పండించే భావోద్వేగాలు వేరే లెవల్‌లో ఉంటాయి. భారతీయ సినిమాలో రొమాన్స్‌కి ఆయనే అసలైన నిదర్శనం” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

“ప్రతి అమ్మాయి కూడా తన భాగస్వామి షారూఖ్ లాగే ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండాలని కోరుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. రొమాన్స్ మరియు లవ్ సీన్స్ విషయంలో ఆయన బెంచ్ మార్క్‌ను చాలా ఎత్తులో నిలబెట్టేశారు. దాంతో సాధారణ జీవితంలో ప్రేమను అంచనా వేయడం కూడా కష్టంగా మారిపోయింది” అంటూ నవ్వుతూ తన మనసులోని మాటను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

షారూఖ్ ఖాన్ నటించిన లవ్ స్టోరీలు, ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తనపై తీవ్ర ప్రభావం చూపాయని మృణాల్ గుర్తుచేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఆయనతో కలిసి వెండితెరను పంచుకునే అరుదైన అవకాశం వస్తే అది తన సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో , సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

షారుఖ్ ఖాన్..

View this post on Instagram

A post shared by D’YAVOL X (@dyavol.x)

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Follow Us