AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Health: ఈ ఐదు సూపర్‌ ఫుడ్స్‌ తింటే.. ఇక మీకు కళ్ళజోడుతో పనుండదు!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ ఉదయం నుండి రాత్రి వరకు కంప్యూటర్స్‌ ముందు కూర్చొనే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సమయం స్క్రీన్ ముందే గడపాల్సి వస్తుంది. ఇలా ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల మన కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.ఇలాంటి పరిస్థితుల్లో మన కంటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. కాబట్టి మీకు కళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Eye Health: ఈ ఐదు సూపర్‌ ఫుడ్స్‌ తింటే.. ఇక మీకు కళ్ళజోడుతో పనుండదు!
Eye Health Foods
Anand T
|

Updated on: Sep 10, 2025 | 5:32 PM

Share

కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏదైనా ఉందంటే అది ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి. శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పోషకాహారం అవసరమైనట్లే, కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన కొన్ని ఆహారాల తీసుకోవడం వల్ల మన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏఏ ఆహరాలు తీసుకోవడం వల్ల మన కంటి చూపును మెరుగుపర్చుకోవచ్చోఇక్కడ తెలుసుకుందాం.

కంటి చూపును మెరుగుపర్చే ఆహార పదార్థాలు

ఆకుకూరలు: పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో లుటీన్, జియాక్సంతిన్ అనే రెండు ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తాయి. అలాననే రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకుకూరలను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎక్కువ కాలం కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

కొవ్వు చేపలు: మన కంటి చూపును మెరుగుపర్చుకోవడానికి చేపలు మంచి ఆహారం. ఎందుకంటే చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కళ్ళు పొడిబారకుండా నివారిస్తుంది. అలాగే రెటీనా కణాలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్స్ :  నారింజ, నిమ్మ, క్యాప్సికమ్ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి కణాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఈ పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిలో కూడా సహాయపడుతాయి.

గుడ్లు: గుడ్లు తినడం వల్ల మన ఆరోగ్యాన్ని అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుడ్డు పచ్చసొన విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్ లకు మంచి మూలం. గుడ్డు పచ్చసొనలలో ఉండే సహజ కొవ్వులు ఈ పోషకాలను శరీరం సులభంగా గ్రహించడానికి సహాయపడతాయి.

గింజలు,  పప్పుధాన్యాలు:  పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదంపప్పులలో విటమిన్ E , మొక్కల ఆధారిత ఒమేగా-3లు పుష్కలంగా ఉంటాయి. కాయధాన్యాలు, శనగపప్పులలో జింక్ ఉంటుంది, ఇది విటమిన్ A ని కళ్ళకు రవాణా చేయడానికి, రాత్రి దృష్టిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.

వైద్య నిపుణుల ప్రకారం.. ఈ ఆహారాలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు A, C, E , జింక్ వంటి పోషకాలు కళ్ళకు రక్త ప్రసరణను పెంచుతాయి. అలాగే మన కంటిలోని రెటీనా, లెన్స్ వంటి సున్నితమైన భాగాలను రక్షిస్తాయి. దీని వల్ల మన కంటి ఆరోగ్యం మెరుగుతుపడుతుంది.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us