AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిని ఖాళీ కడుపుతో తిన్నా, నానబెట్టిన నీరు తాగినా ఎన్ని ప్రయోజనాలో?.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఎండుద్రాక్షలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. ఇవి వ్యాధులను కూడా నయం చేయగలవు అనేది అందిరకీ తెలుసు. అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్షలో నానబెట్టిన నీటిని తాగితే కూడా అనేక రకకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 10, 2025 | 4:30 PM

Share
ఎండుద్రాక్ష నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే ఈ నీటిలో ఉండే పొటాషియం మన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

1 / 5
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు మన శరీరానికి చాలా రకాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం అధిక రక్తపోటు, గుండె సమస్యలు, స్ట్రోక్‌లను సమర్థవంతంగా నివారిస్తుంది.

2 / 5
అలాగే ఎండుద్రాక్షలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలో అలసట తగ్గుతుంది. ఇది ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
ఒకవేళ మీరు రక్తపోటు నియంత్రణ సమస్యలతో బాధపడుతుంటే ఎండుద్రాక్ష నీరు మీకు మంచి ఎంపిక. ఎందుకంటే ఎండుద్రాక్షలో పొటాషియం,ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే మీ ఎముకల బలాన్ని పెంచుకునేందుకు కూడా మీరు నానబెట్టిన ఎండుద్రాక్ష తినవచ్చు. వీటిలో ఉండే కాల్షియం మీ ఎముకలను బలపరుస్తుంది.

4 / 5
అంటు వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. కాబట్టి, ఎండు ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతాయి.

5 / 5