Swollen Eyes Tips: నిద్రలేమి కారణంగా మీరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
Swollen Eyes Tips: మారుతోన్న జీవన శైలి, ఉద్యోగాల పని కాలం కారణంగా నిద్రలేమి సమస్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో చాలా మంది నిద్రకు దూరమవుతున్నారు. ఆహార విధానంలో మార్పు, ఒత్తిడితో...
Swollen Eyes Tips: మారుతోన్న జీవన శైలి, ఉద్యోగాల పని కాలం కారణంగా నిద్రలేమి సమస్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో చాలా మంది నిద్రకు దూరమవుతున్నారు. ఆహార విధానంలో మార్పు, ఒత్తిడితో కూడుకున్న జీవితం వెరసి చాలా మంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఇక రాత్రంతా సరిగా నిద్రపోకపోతే మరునాడు దాని ప్రభావం మనపై స్పష్టంగా పడుతుంది. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోతే కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. దీంతో ఏదైనా వేడుకలకు వెళ్లినా, స్నేహితులను కలిసినా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి నిద్రలేమి వల్ల ఉబ్బిన కళ్లను మాములుగా మార్చి, నొప్పిని కొన్ని సహజ చిట్కాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? కళ్ల వాపును తగ్గించే ఆ నేచురల్ టిప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..
ఐస్‌తో కాపడం..
ఏదైనా వాపు ఉన్న చోట ఐస్‌తో కాపితే వెంటనే ఉబ్బు తగ్గుతుందని మనందరికీ తెలిసిందే. కళ్లకు కూడా ఇదే వర్తిస్తుంది. ఐస్ ప్యాక్ లేదా, చల్లగా ఉన్న కూరగాయలు, చల్లగా ఉండే వాటర్ బాటిల్‌తో కళ్లపై రుద్దితే వెంటనే ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా మార్కెట్లో రకరకాల ఐ మాస్క్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగిస్తే ప్రయోజనం కలుగుతుంది.
టీ బ్యాగ్స్..
వాడిన టీ బ్యాగ్‌లు కూడా కళ్ల వాపును తగ్గిస్తాయి. ఇందుకోసం టీ బ్యాగ్‌ను కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అనంతరం కళ్లపై 5 నుంచి 8 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇందులో ఉండే కెఫైన్, యాంటీఆక్సిడెంట్‌లు కళ్ల చుట్టూ ఉన్న చర్మం బిగుతుగా మారడంలో ఉపయోగపడుతుంది.
కీరా ముక్కలు..
కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి కళ్లకు మాస్కులా ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా 15 నిమిషాల పాటు క్రమం తప్పకుండా చేస్తే. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వయాలు పోవడమే కాకుండా కళ్ల కింద ఉండే వాపు కూడా తగ్గుతుంది.
స్పూన్‌తో కూడా..
ముందుగా ఓ స్పూన్‌లో ఫ్రిడ్జ్‌లో 30 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం దానిని తీసి కళ్లపై అద్దాలి ఇలా చేసినా కళ్ల వాపు తగ్గుతుంది.
కలబంద గుజ్జు..
కలబంద కళ్లకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు కళ్లలో ఉండే దురదను తగ్గిస్తాయి. అయితే ఫ్రిడ్జ్‌లో కాసేపు ఉంచిన కలబందను ఇందుకు ఉపయోగించాలి.
కోడి గుడ్డు మాస్కు..
గుడ్డులో ఉండే తెల్లటి సోన కూడా కంటికి మేలు చేస్తుంది. తెల్లటి సొనను కళ్లకు అప్లై చేసుకున్న 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో ఉండే అస్ట్రిజంట్ లక్షణాలు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: New Drone Policy: గుడ్‌న్యూస్.. డ్రోన్‌ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు..
Oil India Recruitment: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.