Apple Kheer Recipe: పండగ సీజన్‌లో కొన్ని రుచికరమైన వంటకాలను తయారు చేసి తినడంలో ఉండే మజా వేరు. అయితే పండగల సమయంలోనే కాదు..మనసుకి ఏదైనా డిఫరెంట్ గా తినాలనిపిస్తే.. కూడా రకరకాల టేస్టీ టేస్టీ ఆహారాలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖీర్ ను ఇష్టపడేవారు.. ఈసారి రైస్ ఖీర్ కాకుండా యాపిల్ ఖీర్ ట్రై చేయండి. ఇది చాలా ఆరోగ్యకరమైనది. రుచికరమైనది. యాపిల్స్‌లో కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఈ ఖీర్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. దీన్ని చేయడానికి కావాల్సిన పదార్ధాలు కూడా ఈజీగా దొరుకుతాయి. రాత్రి భోజనం తర్వాత మీరు ఈ రుచికరమైన డెజర్ట్‌ని ఆస్వాదించవచ్చు. మీరు ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసుకుంటే.. మీరు ఈ డెజర్ట్‌ను అతిధులకు అందించవచ్చు. యాపిల్ ఖీర్ తయారు చేసే సులభమైన పద్ధతిని గురించి ఈరోజు తెలుసుకుందాం.
కావలిసిన పదార్ధాలు:
ఆపిల్స్-2
చిక్కటి పాలు- అరలీటరు
కండెన్స్ మిల్క్- 2 టేబుల్ స్పూన్లు
ఆకుపచ్చయాలకులు- 4
నెయ్యి- 1 టేబుల్ స్పూన్
బాదం-2 టేబుల్ స్పూన్లు తరిగినవి
కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు- 2 టేబుల్ స్పూన్లు తరిగినవి
ఆపిల్ ఖీర్ తయారు చేసే విధానం: ముందుగా యాపిల్‌ను బాగా కడిగి తొక్క తీసి శుభ్రం చేయండి. యాపిల్ ను తురిమి ఒక పెద్ద గిన్నెలో వేయండి. యాపిల్ ఖీర్ తయారీకి తీపి యాపిల్స్ ను ఉపయోగించండి.
స్టెప్- 2
మీడియం మంట మీద గ్యాస్ మీద పాన్ ఉంచండి. వేడి ఎక్కిన తర్వాత నెయ్యి వేయండి. బాదాం, కిస్మిస్, జీడిపప్పు లను వేయించండి. వాటిని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుని మళ్ళీ పాన్ లో నెయ్యి వేసి.. తురిమిన ఆపిల్ జోడించండి. నేతిలో 5 నుండి 10 నిమిషాలు యాపిల్ తురుముని వేయించండి. ఈ సమయంలో గ్యాస్ స్విమ్ లో పెట్టండి. యాపిల్స్ ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. చల్లారనివ్వాలి.
స్టెప్ – 3
ఇప్పుడు పాన్‌లో పాలు పోసి.. వేడి చేయండి.. పాలు మరిగిన అనంతరం మంటను స్విమ్ లో పెట్టి.. చిక్కగా అయ్యేవరకూ పాలను మారగించండి. తర్వాత పాన్‌లో కండెన్స్‌డ్ మిల్క్ జోడించండి. బాగా కలపండి.
స్టెప్ – 4
ఈ మిశ్రమాన్ని ఉడికించిన అనంతరం.. ఈ మిశ్రమంలో తరిగిన బాదం, యాలకుల పొడిని వేసి ఉడికించండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఫ్రిజ్‌లో ఉంచండి. చల్లారనివ్వాలి. ఆ తర్వాత అందులో వేయించిన యాపిల్స్ తురుముని వేసి బాగా కలపాలి. అంతే యాపిల్ ఖీర్ రెడీ. దీనిని అలంకరించడానికి ఆపిల్ ముక్కలతో పాటు.. డ్రై ఫ్రూట్స్ ను కూడా ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ వంటకాన్ని నిజంగా పిల్లలు, పెద్దలు ఇష్టపడతారు. మీరు ఇంట్లో ఒకసారి ప్రయత్నించి చూడండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..