Car Driving: వర్షకాలంలో కారు నడిపిస్తున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ప్రస్తుతం ప్రవేశించిన రుతుపవనాలతో కాస్త ఉపశమనం లభించింది. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షా కాలంలో ప్రధానంగా రోడ్లపై డ్రైవింగ్ చేసే వారికి కష్టంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కారు డ్రైవింగ్ చేసే వారు వర్షా కాలంలో కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు...

మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ప్రస్తుతం ప్రవేశించిన రుతుపవనాలతో కాస్త ఉపశమనం లభించింది. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షా కాలంలో ప్రధానంగా రోడ్లపై డ్రైవింగ్ చేసే వారికి కష్టంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కారు డ్రైవింగ్ చేసే వారు వర్షా కాలంలో కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* వర్షంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో కారు స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే వర్ష కాలంలో కారు టైర్ల గ్రిప్‌ని చేసుకోవాలి. టైర్లు అరిగిపోయినట్లయితే వెంటనే మార్చుకోవాలి. అలాగే వర్షా కాలంలో గుంతలు కనిపించవు దీని కారణంగా కూడా టైర్లపై ప్రభావం పడుతుంది. కాబట్టి టైర్ల ఫిట్‌నెస్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.
* వర్ష కాలంలో కార్లు ఎక్కడైనా ఆగిపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వర్షా కాలం ప్రారంభంలో ముందుగా కారును సర్వీస్ చేయించుకోవాలి. దీనివల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
* వర్షా కాలంలో బ్రేకుల పనితీరుపై కూడా కాస్త ప్రభావం పడుతుంది. కాబట్టి బ్రేక్‌లను కూడా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యంగా. సరైన సమయంలో బ్రేక్‌లు పడాలంటే కచ్చితంగా వాటి పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకకుంటూ ఉండాలి.
* ఇతర సమయాలతో పోల్చితే వర్షాకాలంలో కార్లు పాడైతే వెంటనే మెకానిక్స్ దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో లాంగ్ జర్నీలు చేస్తుంటే కారులో అవసరమైన టూల్స్, అక్సెసెరిస్‌ను కచ్చితంగా వెంటే ఉంచుకోవాలి. వీటివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.
* ఇక వర్షాకాలంలో కచ్చితంగా చెక్ చేసుకోవాల్సి వాటిలో కారు వైపర్స్ పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. వర్షం కారణంగా రోడ్లు అస్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి రెయిర్ అద్దాలతో పాటు వైపర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
