Lifestyle: మీరు వాడుతోన్న పసుపు అసలా, నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
పసుపులో ఎంతటి ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లాంటి ఎన్నో ఔషధ గుణాలకు పసుపు పెట్టింది పేరు. కొందరు కేటుగాళ్లు అడ్డదారిలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా నకిలీ పసుపు తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ పసుపును తీసుకుంటే...

ప్రస్తుతం మార్కెట్లో నకిలీ వస్తువుల హవా కొనసాగుతోంది. ఉప్పు నుంచి పప్పు వరకు నూనె నుంచి పాల వరకు కల్తీ వస్తువులను మార్కెట్లోకి వదులుతూ కొందరు కేటుగాళ్లు ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిన్నటికి నిన్న ఏకంగా నకిలీ మందుల కలకలం రేపాయి. ఈ క్రమంలోనే మార్కెట్లో లభించే పసుపును కూడా కేటుగాళ్లు నకిలీ చేసేస్తున్నారు.
పసుపులో ఎంతటి ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లాంటి ఎన్నో ఔషధ గుణాలకు పసుపు పెట్టింది పేరు. కొందరు కేటుగాళ్లు అడ్డదారిలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా నకిలీ పసుపు తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ పసుపును తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడడం ఖాయం. ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న పసులను నిజమైందా.? నకిలీదా.? తెలుసుకునేందుకు ఎన్ని సింపుల్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు నాణ్యతను గుర్తించడానికి ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. అనంతరం అందులో చెంచా పసుపును వేయాలి. తర్వాత బాగా కలపాలి. ఒకవేళ పూర్తిగా కరిగిపోతే అది మంచి పసుపుగా పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా గ్లాసు చివరిలో చేరితో అది నకిలీదని అర్థం. ఒకవేళల కల్తీ పసుపు అయితే నీటి రంగు ముదురుగా ఉంటుంది. అరచేతిలో చిటికెడు పసుపు వేసి బొటన వేలుతో కొద్ది సేపు రుద్దండి, ఒకవేళ పసుపు అసలు అయితే చేతికి ఎలాంటి మరక అంటదు. లేదంటే అందులో ఏదో రంగు కలిపారని అర్థం. ఇలా సింపుల్ చిట్కాల ద్వారా మీరు కొనుగోలు చేసిన పసుపు అసలా, నకిలీనా తెలుసుకోవచ్చు. ఇక రెడీమేడ్ కాకుండా స్వంతంగా పసుపు కొమ్ములను కొనుగోలు చేసి గ్రైండ్ చేయించుకుంటే నకిలీ జరిగే అవకామే ఉండదు.
Follow these steps to know the wether you are using real turmeric or fake




