Smoking: స్మోకింగ్ మానేయలనుకుంటున్నారా.? వెంటనే ఇలా చేయండి..

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పొగరాయుళ్లు మాత్రం ఆ అలవాటును మానుకోరు. ఒక సిగరెట్ 11 నిమిషాల జీవిత కాలాన్ని హరిస్తుందని నిపుణులు చెబుతుంటారు. క్యాన్సర్‌ మొదలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు స్మోకింగ్ కారణమవుతుంది. ఇక స్మోకింగ్‌ను మానుకోవాలని ఎంత ప్రయత్నించినా మళ్లీ మొదలు పెడతారు. అయితే నిజంగా స్మోకింగ్ మానుకోవాలంటే మాత్రం...

Smoking: స్మోకింగ్ మానేయలనుకుంటున్నారా.? వెంటనే ఇలా చేయండి..
Smoking
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 21, 2024 | 8:58 PM

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పొగరాయుళ్లు మాత్రం ఆ అలవాటును మానుకోరు. ఒక సిగరెట్ 11 నిమిషాల జీవిత కాలాన్ని హరిస్తుందని నిపుణులు చెబుతుంటారు. క్యాన్సర్‌ మొదలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు స్మోకింగ్ కారణమవుతుంది. ఇక స్మోకింగ్‌ను మానుకోవాలని ఎంత ప్రయత్నించినా మళ్లీ మొదలు పెడతారు. అయితే నిజంగా స్మోకింగ్ మానుకోవాలంటే మాత్రం కచ్చితంగా కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్‌ ఏంటంటే..

* స్మోకింగ్‌ మానేయాలనుకుంటున్న విషయాన్ని స్నేహితులతో, కుటుంబసభ్యులతో తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల మరోసారి వారి ముందు స్మోకింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తారు.

* సిగరెట్‌కు సంబంధించిన వస్తువులను మీ దగ్గరికీ కూడా రానివ్వకండి. ముఖ్యంగా హాష్‌ ట్రేతో పాటు లైటర్‌ లాంటివి లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల మీ ఆలోచన స్మోకింగ్ వైపు మళ్లకుండా ఉంటుంది.

* ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే వైద్యులను సంప్రదించాలి. స్మోకింగ్ మానేందుకు కౌన్సెలింగ్‌ వంటి చిట్కాలు ఉంటాయి.

* ఇక స్మోకింగ్ చేయాలని అనిపించినప్పుడల్లా చాక్లెట్ కానీ, సోంపు కానీ వేసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆలోచన మారుతుంది.

* అలాగే స్మోకింగ్‌కు బదులు ఏదైనా ఒక పండును తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల మీకు స్మోకింగ్‌పై ఆసక్తి తగ్గి, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

* స్మోకింగ్‌ చేయడాన్ని ఆపేయాలంటే ఏదైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉండటం, బాగా తినడం, బాగా నిద్రపోవడం అలవాటుగా మారతాయి. దీంతో స్మోకింగ్‌పై ఆసక్తి పూర్తిగా దూరమవుతుంది.

* మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జ్యూస్ లను అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

* యోగా, మెడిటేషన్ వంటి వాటిని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల మీ మనసును మీరు కంట్రోల్ చేసుకునే శక్తి లభిస్తుంది.

* ఇక మార్కెట్లో స్మోకింగ్ అలవాటును దూరం చేసే ప్రొడక్ట్స్‌ కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోనూ మంచి ఫలితం ఉంటుంది. అయితే వీటిని ఉపయోగించే ముందు వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..