Acidity: అసిడిటీ వేధిస్తోందా.? ఇలా చేస్తే రెండు రోజుల్లో సమస్య పరార్..
ప్రస్తుతం అసిడిటీ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఎక్కువుతోంది. అయితే కొన్ని నేచురల్ చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పుల కారణంగా అసిడిటీ సమస్య ఎక్కువవుతోంది. కడుపుబ్బరం, అజీర్ణం, మలబద్ధకం, పుల్లటి తేన్పులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయి. అసిడిటీని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో అల్సర్‌కు దారి తీస్తుందని అంటున్నారు. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం, కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. భోజనానికి భోజనాకి మధ్య 4 గంటల కంటే ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటే కూడా మానుకోవాలి. పడుకునే ముందు కనీసం 2 గంటల ముందే తినేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. నూనెతో, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తృణధాన్యాలు, పప్పులు, సీడ్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి ద్వారా మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
ఇక కాఫీలు, కూల్‌డ్రింక్స్‌కు బదులుగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇది కడుపులో యాసిడ్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇహారాన్ని మింగే ముందు వీలైనంత ఎక్కువ సార్లు నమలాలి అని అంటున్నారు. హడావుడిగా తినేవారిలో కడుపులో గ్యాస్ సమస్య ఎక్కువుతుంది. ఇది ఎసిడిటీకి దారి తీస్తుంది. ఇక దినచర్యను క్రమంతప్పకుండా అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే కాసేపు మెడిటేషన్, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
