AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breast cancer: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కావొచ్చు

ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఏకంగా 30 శాతం కేసులు బ్రెస్ట్ క్యాన్సర్ కేసులే ఉన్నాయని అధ్యయనంలో తేలింది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Breast cancer: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కావొచ్చు
Breast Cancer
Narender Vaitla
|

Updated on: Nov 04, 2024 | 3:56 PM

Share

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ సంఖ్యలు ఎక్కువవుతున్నాయి. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో 30 శాతం రొమ్ము క్యాన్సర్‌ కేసులే అని తేలింది. ఇది కూడా ప్రాణాంతకమైన వ్యాధి. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే, రొమ్ము క్యాన్సర్ లక్షణాలు చాలా ముందుగానే కనిపిస్తాయి. అందుకే రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రొమ్ము ఆకారంలో మార్పులు వస్తే క్యాన్సర్‌ ముందస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు. రొమ్ము పరిమాణం, సునితత్వంలో మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

* ఇక అండర్‌ ఆర్మ్‌ (చంకల్లో) ప్రాంతంలో కణితులు ఏర్పడుతున్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఈ సమస్య కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు.

* చనుమొనల్లో అసాధారణ మార్పు కనిపించినా అది క్యాన్సర్‌కు ముందుస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు. అసాధారణంగా పెరుగుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే చనుమొనల నుంచి రక్తపు లేదా పసుపు రంగు లిక్విడ్ రావడం కూడా ప్రమాదకరంగా భావించాలని అంటున్నారు.

* రొమ్ములో సున్నితత్వం పెరిగినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని అంటున్నారు. ముఖ్యంగా చిన్నగా టచ్‌ చేసినా నొప్పి ఉంటుంది. ఇలాంటి అనుభూతి కలుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* చనుమొనల వద్ద లేదా రొమ్ము చర్మం ఎర్రగా మారినా పొడిగా మారినా అది క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలని అంటున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?