Wake Up Early: పిల్లలు పొద్దున్నే నిద్రలేవడానికి బద్దకిస్తున్నారా.. అయితే పెద్దవారు ఈ విషయాలను తెలుసుకోవలిసిందే..

Wake Up Early in the Morning: మన పూర్వీకులు 80 ఏళ్ళు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా(Healthy) ఉండేవారు. దీనికి కారణం పోషకాహారం , సమయానికి నిద్ర అని చెప్పవచ్చు. అయితే మారుతున్న కాలంతో పాటు మనిషి,.

Wake Up Early: పిల్లలు పొద్దున్నే నిద్రలేవడానికి బద్దకిస్తున్నారా.. అయితే పెద్దవారు ఈ విషయాలను తెలుసుకోవలిసిందే..
Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 29, 2022 | 1:37 PM

Wake Up Early in the Morning: మన పూర్వీకులు 80 ఏళ్ళు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా(Healthy) ఉండేవారు. దీనికి కారణం పోషకాహారం , సమయానికి నిద్ర అని చెప్పవచ్చు. అయితే మారుతున్న కాలంతో పాటు మనిషి అలవాట్లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. తినే తిండి, నిద్ర పోయే సమయం.. నిద్ర లేచే సమయం ఇలా అన్ని విషయాల్లో మార్పులు వచ్చాయి. వీటితో పాటు వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే రొజూ తెల్లవారు జామున నిద్ర లేవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు తెల్లవారు జామునే నిద్ర లేవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

*ఏ వయసు వారైనా సరే తెల్లవారి జామున నిద్ర లేవడం మంచిది. ఉదయాన్నే నిద్ర లేవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో శరీరంలో విడుదల అయ్యే హార్మోన్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఉదయం శరీరానికి తగిలే చల్లని గాలి ఆహ్లాదాన్ని ఇస్తుంది. సూర్యోదయ కిరణాలు శరీరానికి డీ విటమిన్ ను అందిస్తుంది. *తెల్లవారు జామున నిద్ర లేచి.. వెంటనే నీరు తాగడం వలన 2 సార్లు మల విసర్జన చేయడానికి సమయం ఉంటుంది. దీంతో పేగులు శుభ్రపడతాయి. అదే నిద్ర ఆలస్యంగా లేస్తే.. త్వర త్వరగా పనులు చేసుకోవాలంటే హడావిడిలో ఒకసారి మలవిసర్జన చేసి పనులలోకి వెళ్ళిపోతాం. పేగులలో ఇంకా బయటకి రావాల్సిన మలం ఉండిపోతుంది. దీంతో పేగులకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. *.తెల్లవారి జామున నిద్ర లేచి వ్యాయామం, యోగ వంటివి చేయడం వలన శరీరం ఫిట్ గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. *వేకువజామునే నిద్రలేవడం వల్ల సహజంగానే ఉదయం టిఫిన్ తినడం అలవాటు అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. *తెల్లవారు జామున నిద్రలేచేవారు రోజంతా యాక్టివ్ గా ఉంటారు. త్వరగా లేవడం వలన శరీరం బాగా అలసిపోయి.. రాత్రి త్వరగా నిద్రపోతాం. *ఎర్లీ మార్నింగ్ లేవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు ఉదయం సమయంలో అత్యంత వాంఛనీయ స్థాయిలో ఉంటుంది.ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకునేందుకు సరైన సమయం.. కనుక తెల్లవారు జామున నిద్ర లేచే అలవాటుని పెద్దలు పిల్లలకు నేర్పాలి. ఉదయం 4-5 గంటల సమయంలో లేచి రాత్రి 9గంటలకు నిద్రపోవాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది

Also Read:  గొల్లపూడి మారుతీరావు భార్య మృతి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసిన శివకామసుందరి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ