Walnut: వాల్‌నట్ తొక్కలు పనికిరావని పడేస్తున్నారా.. మీరు చాలా నష్టపోతున్నట్లే.. ఎందుకంటే వీటితో కూడా బోలెడు ప్రయోజనాలు..
Walnut Shells Uses: వాల్‌నట్‌లను ఉదయాన్నే తినాలని మనందరికీ తెలుసు. దాని వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే వాల్ నట్స్ మీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా.
మీరు మీ రోజువారీ జీవితంలో చాలా వాల్‌నట్‌లను తింటూ ఉంటారు. వాల్‌నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో.. అలాగే అవి మిమ్మల్ని తాజాగా ఉంచుతాయని మనందరికీ తెలుసు. వాల్ నట్స్ లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. ఇది మన చర్మాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తుంది. కాబట్టి, ఈ కథనం ద్వారా చర్మానికి వాల్‌నట్‌ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
మృదువైన చర్మానికి వాల్‌నట్స్..
వాల్ నట్ తొక్కలు చర్మాన్ని చాలా మృదువుగా చేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ముఖం మెరిసిపోవాలని కోరుకుంటారు. వాల్‌నట్‌లు ఈ విషయంలో మీకు సహాయపడతాయి. ఇది పొడి చర్మం నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
మచ్చలను తగ్గిస్తాయి..
మీరు వాల్‌నట్ పీల్స్‌తో ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు.. ఇది చర్మం లోపల ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది. అలాగే, ఇది మీ ముఖంపై మురికి వల్ల ఏర్పడిన మరకలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
జిడ్డుగల చర్మానికి..
జిడ్డు చర్మం ఉన్నవారికి వాల్‌నట్ పీల్స్ చాలా మేలు చేస్తాయి. మీరు వాల్‌నట్ తొక్కల నుంచి పొడిని తయారు చేసుకోవాలి. ఆ పొడిని మీ చర్మంపై అప్లై చేయవచ్చు.. ఇది మీ చర్మం నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో మీకు సహాయపడుతుంది. మనం చాలా సార్లు సున్ని పిండిని రాసినట్లుగానే ఈ పొడిని రాస్తే సరిపోతుంది. జిడ్డు చర్మంకు కాస్తా ఉపయోగం.
వాల్‌నట్ షెల్స్‌ను అస్సలు పడేయకండి..
వాల్ నట్స్ మాత్రమే కాదు, వాటి తొక్కలు కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి మెరుపును తీసుకురావడంలో సహాయపడేటప్పుడు.. వాటిని విసిరివేయడం ఎందుకు.. దాచుకుని మెత్తగా దంచి ఇలా ఉపయోగించవచ్చు. ఇది మోహంపై వచ్చే మచ్చల నుంచి మంచి ఉపశమనంను అందిస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..