Trendy Tips: గుబురుగా, అందాంగా గడ్డం రావడం లేదా.. ఖచ్చితంగా వీటిని ప్రతి రోజు తినండి.. నల్లని మెరిసే గడ్డం మీ సొంతం

గడ్డం నలుపు, పొడవు, మందంగా చేయడానికి బయోటిన్‌ను రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. మొదటి మార్గం బయోటిన్ రిచ్ ఫుడ్స్ తినడం రెండవ మార్గం బయోటిన్ రిచ్ ఆయిల్, క్రీమ్, జెల్ మొదలైనవి..

Trendy Tips: గుబురుగా, అందాంగా గడ్డం రావడం లేదా.. ఖచ్చితంగా వీటిని ప్రతి రోజు తినండి.. నల్లని మెరిసే గడ్డం మీ సొంతం
Beard Growth
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2022 | 5:58 PM

గడ్డం పెంచడం ఈ రోజుల్లో ష్యాషన్ సింబల్‌గా మారింది. కొత్తగా ట్రెండీగా ఉండాలని ప్లాన్ చేస్తుంటారు. అందుకే చాలా మంది అబ్బాయిలు గడ్డం పెండచానికి ప్రయత్నిస్తుంటారు. ఇది సౌత్ ఇడియాలో అధికంగా కనిపిస్తుంది. అంతే కాదు రష్యా వంటి దేశాల్లో కూడా ఇది కొంత ఫ్యాషన్ అని చెప్పవచ్చు. ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు నేటి యువతరం. అయితే ఇది అందిరికి సాధ్యం కాదు. ఎందుకంటే అలా అందంగా పెంచాలంటే స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. దీని కోసం బ్యూటీషన్లను సంప్రదిస్తుంటారు. అలా జుట్టు నల్లగా, మెరుస్తూ, అందంగా ఉండాలంటే కెరాటిన్ అవసరం. ఇది జుట్టుకు రంగును, మెరుపును ఇవ్వడానికి పనిచేస్తుంది. కెరాటిన్ ఒక ప్రత్యేక రకం ప్రోటీన్, ఇది జుట్టు, చర్మం, గోళ్లకు చాలా ముఖ్యమైనది. కెరాటిన్ ఉత్పత్తికి బయోటిన్ అవసరం. ఇది మనం తినే ఆహారం నుంచి లభించే ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులను జీర్ణం చేయడంలో శరీరానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం అలాంటి అందమైన గడ్డం గురించి తెలుసుకుందాం. మీ గడ్డం నల్లగా, మందంగా, జుట్టు మెరుస్తూ ఉండటానికి బయోటిన్ ఎలా సహాయపడుతుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే గుబురు గడ్డం పెంచి మంచి స్టైలిష్‌ లుక్‌తో అదరగొట్టవచ్చు. అయితే మీరు కూడా అలా నల్లటి జట్టుతో ట్రెండింగ్‌గా కనిపించాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ఈ చిట్కాలు మీ కోసమే..

గడ్డం ఎలా పెంచాలి..

మీరు గడ్డం పెంచుకోవాలనుకుంటే బయోటిన్ వినియోగం మీకు సహాయపడుతుంది. పైన చెప్పినట్లుగా.. బయోటిన్ తీసుకోవడం వల్ల కెరాటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు స్ట్రాంగ్ గా, షైనీగా మారుతుంది. జుట్టు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే కెరాటిన్ చాలా అవసరం. ఇది వాటి మందం, పొడవు, షైన్ లేదా రంగు మార్చేస్తుంది.

బయోటిన్ అంటే ఏంటి..

బయోటిన్‌ను విటమిన్-బి7 అంటారు. దీని రెగ్యులర్ వినియోగం జుట్టు పెరుగుదల, చర్మం మెరుపు, ఆరోగ్యానికి అవసరం. గడ్డం వెంట్రుకలను పొడిగించడం ద్వారా మీరు కూడా ఇలా ట్రై చేయవచ్చు. ఈ బయోటిన్‌తో మీ గడ్డం కూడా షేప్-అప్ చేయవచ్చు. గడ్డం కోసం బయోటిన్‌ను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

గడ్డం పెంచడానికి Biotin ఎలా ఉపయోగించాలి?

గడ్డం నలుపు, పొడవు, మందంగా చేయడానికి బయోటిన్‌ను రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. మొదటి మార్గం బయోటిన్ రిచ్ ఫుడ్స్ తినడం రెండవ మార్గం బయోటిన్ రిచ్ ఆయిల్, క్రీమ్, జెల్ మొదలైనవి. ఈ రెండు పద్ధతులను కలిపి ఉపయోగించమని బ్యూటిషన్లు సిఫార్సు చేస్తున్నారు. తద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు కోరుకున్న ఫలితాన్ని త్వరగా పొందవచ్చు.

మీరు మార్కెట్లో బీర్ ఆయిల్, బార్డ్ జెల్, బార్డ్ క్రీమ్‌లను బయోటిన్ రిచ్ బార్డ్ కేర్ ప్రొడక్ట్స్‌గా సులభంగా కనుగొనవచ్చు. మీరు కూడా అలాంటి వాటిని ఉపయోగించండి. వీటితో పాటు మార్కెట్ (మిల్లెట్స్), చిలగడదుంపలు, పుట్టగొడుగులు, అరటిపండ్లు, గుడ్లు, పాలకూర మొదలైనవి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలుగా తినండి. మీరు త్వరలో మీ గడ్డాన్ని మీకు ఇష్టమైన ఆకృతిలో పొందుతారు.

వీరికి చాలా ప్రయోజనకరమైన

  • తక్కువ గడ్డం ఉన్నవారికి
  •  గుబురు గడ్డం లేనివారికి
  • గడ్డంలో తెల్ల వెంట్రుకలు వస్తున్నవారికి
  • గడ్డం మందంగా లేనివారికి
  • గడ్డం జుట్టు తక్కువ మెరుపును కలిగి ఉన్నవారికి
  • గడ్డం వెంట్రుకలు నునుపుగా ఉండేవారికి

చర్మం ద్వారా బయోటిన్‌ను స్వీకరిస్తుంది. చర్మం దానిని గ్రహిస్తుంది లేదా అనే దాని గురించి ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉంది. కానీ మీరు మార్కెట్‌లో అటువంటి క్రీములు, నూనెలను సులభంగా కనుగొలు చేయవచ్చు. ఇవి బయోటిన్ సమృద్ధిగా ఉన్నాయని.. జుట్టును త్వరగా పొడవాటి, ఒత్తుగా మారుస్తాయని కనిపించే ప్రకటనలను నమ్మాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇలా ప్రకటనలు అన్ని నిజం కాదు.

వీటితో పాటు ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. టెన్షన్ లేదా ఒత్తిడి వాతావరణం నుంచి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తే గుబురు గడ్డంతో పాటు ఫ్యాషన్ లుక్ ‌తో అదరగొట్టవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఫ్యాషన్ న్యూస్ కోసం