Telugu News » Lifestyle » Fashion » Skin care tips: It is best to apply these things with Coffee Face Pack for instant glow
Coffee Face Pack: కాఫీ పొడితో నిగనిగలాడే అందం మీ సొంతం.. ఇలా చేస్తే వెంటనే ఫలితం..
Coffee Face Pack For Glowing Skin: అద్భుతమైన రుచికి ప్రసిద్ధి చెందిన కాఫీ చర్మ సంరక్షణలో కూడా ఉత్తమమైనది. కాఫీ పొడిని పలు రకాల పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటే.. చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తేనె-కాఫీ: తేనె - కాఫీ స్క్రబ్‌ను తయారు చేసి ముఖానికి రాసుకుంటే తక్షణమే.. ఫలితం వస్తుంది. కాఫీ మొహంలోని మురికిని తొలగిస్తుంది. తేనె తేమను నిలుపుతుంది. దీంతో ఫేస్ నిగనిలాడుతుంది.
1 / 5
పెరుగు - కాఫీ: ఈ ప్యాక్‌లు ముఖం పొడిబారడాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కావాలంటే పెరుగు, కాఫీలో తేనె కూడా కలుపుకోవచ్చు. రాత్రి పూట ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది.
2 / 5
నెయ్యి - కాఫీ: కాఫీతో ముఖానికే కాదు పెదవులకు కూడా సంరక్షణ లభిస్తుంది. నెయ్యి, కాఫీ పొడి కలిపి పెదవులపై మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారుతాయి.
3 / 5
కొబ్బరినూనె-కాఫీ: వీటిని కలపడం ద్వారా మంచి ఫేస్ ప్యాక్ స్క్రబ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. సుమారు 10 నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీంతో చర్మం నిగనిగలాడుతుంది
4 / 5
క్రీమ్ - కాఫీ: మీరు కళ్ల కింద నల్లటి వలయాలను ఎదుర్కొంటున్నట్లయితే.. కాఫీ, క్రీమ్‌ను పేస్ట్ చేసి అప్లై చేయండి. దీంతో కళ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోవడంతోపాటు పొడిబారే సమస్య నుంచి కూడా గట్టెక్కవచ్చు.