మీసం మెలేసిన మహిళ.. చనిపోవాలనే ఆలోచన నుంచి తనే ఓ బ్రాండ్‏గా మారిన వనిత!…

మానవుని రేపు రేఖలను బట్టి లోపాలను గుర్తిస్తుంటాము. అయితే స్త్రీ, పురుషులను గుర్తించాలంటే కొన్ని అవయవాల అమరికను బట్టి

మీసం మెలేసిన మహిళ.. చనిపోవాలనే ఆలోచన నుంచి తనే ఓ బ్రాండ్‏గా మారిన వనిత!...
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 25, 2021 | 11:38 AM

మానవుని రేపు రేఖలను బట్టి లోపాలను గుర్తిస్తుంటాము. అయితే స్త్రీ, పురుషులను గుర్తించాలంటే కొన్ని అవయవాల అమరికను బట్టి గుర్తిస్తుంటాము. ఇక మానవుని రూపురేఖలను పోల్చేటప్పుడు ఏది అసహజంగా అనిపించినా.. అది లోపమేనని నమ్ముతోంది ఈ సమాజం. ఆడ వారంటే ఇలా ఉండాలి. మగవారంటే ఇలా ఉండాలి.. ఇద్దరి మధ్య పోలికలలో తేడా ఉండాలని అనేది అందరిలో ఉన్న బలమైన ఆలోచనలు. కానీ కొందరు విభిన్నంగా పోలికలు ఉండటం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. పోలికల్లో తేడా ఉంటే అది జన్యుపరమైన లోపం అని చెబుతుంటారు వైద్య నిపుణులు. కొందరి మహిళలకు కొన్ని లోపాల కారణంగా సమాజంలో అవమానానికి గురవుతుంటారు. కానీ అలాంటి పోలికలు కొందరికి మాత్రమే వస్తుంటాయి. అది జన్యులోపం కావచ్చు.. మరేదైన కావచ్చు.. కానీ.. ఎన్నో అవమానాలను తట్టుకుని.. ప్రస్తుతం ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన వనిత హర్మాన్ కౌర్..

Harman

హర్మాన్ కౌర్.. బ్రిటన్‏కు చెందిన ఈ అమ్మాయికి గడ్డం ఉంది. 11 ఏళ్ల వయసులోనే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్యతో మగవారిలా గడ్డాలు.. మీసాలు రావడం మొదలయ్యాయి. దాంతో చిన్న వయసులోనే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. చుట్టుపక్కల వారు.. తోటి స్నేహితులు ఎన్నో రకాలుగా అవమానించారు.. వ్యాక్సింగ్ చేయించుకున్నప్పుడల్లా నరకం చూసేది.. ప్రతి ఐదురోజులకు బలంగాద దృఢంగా వెంట్రుకలు పెరిగిపోయేవి. చర్మం కోసుకుపోయేది.. ముట్టుకుంటే నొప్పి పుట్టేంత బిరుసుగా మారిపోయేది. ఆ బాధను తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించి.. లోపాన్ని అవమానంగా భావించడం కన్నా…. ప్రత్యేక గుర్తింపుగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

Untitled 1

వ్యాక్సింగ్ చేయించుకోవడం ఆపేసి గడ్డం పెంచడం మొదలుపెట్టింది. మీసాలు షేవ్ చేసుకుని తలకు స్టైల్ గా క్లాత్ చుట్టు తనకంటూ ప్రత్యేక రూపాన్ని సొంతం చేసుకుంది. గడ్డం ఉన్న అతి చిన్న మహిళగా గిన్నిల్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది… తన గడ్డానికి సుందరి అని పేరు కూడా పెట్టుకుంది. తన రూపాన్ని తన కాలిపై పచ్చ బొట్టు వేయించుకుంది. 2014లో ఆమె లండన్ ఫ్యాషన్ వీక్‏లో ర్యాంప్ వాక్ చేసి అందరి చూపి తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు హర్మాన్ ఒక బ్రాండ్‏గా మారింది. ఎన్నో బ్రాండ్లకు మోడల్ గా మారింది. ఎన్నో మోటివేషన్ క్లాసులు ఇస్తుంది.

Also Read: Rajini Kanth: ఈరోజు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న రజినీకాంత్.. అయినా తలైవా మనసులో బాధే ఎందుకో..

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్..

Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..