మాయ లేదు మంత్రం లేదు.. రోజూ 40 నిమిషాలు ఇలా చేస్తే.. మీ బ్రెయిన్ సూపర్ స్పీడ్‌లో పనిచేస్తుంది!
ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో మతిమరపు కూడా ఇకటి, ప్రస్తుత లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది బద్దకంగా తయారవుతున్నారు. శారీరక శ్రమ చేయడం మానేశారు. దీని వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.అయితే మన రోజువారి జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నారు. ఆ మార్పులేంటో తెలుసుకుందాం పదండి.

ఈ మధ్య కాలంలో చాలా మంది మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే ఇది మీ కోసమే.. మీ రోజువారి జీవితంలో ఒక వ్యాయామన్ని చేర్చుకోవడం ద్వారా మీ జ్ఞాపకశక్తిని మీరు మెరుగుపర్చుకోవచ్చు. అవును, అది నేను చెబుతున్నది కాదు.. విశ్వవిద్యాలయం, రైస్ విశ్వవిద్యాలయం పరిశోదకులు చెబుతున్నారు. రోజూ లేదా వారినికి మూడుసార్లు 40 నిమిషాలు నడవడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఒక వాళ్లు చెబుతున్నారు. పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం, ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం, రైస్ విశ్వవిద్యాలయం, ఒహియో స్టేట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 2011లో నిర్వహించిన అధ్యయనంలో రోజుకు 40 నిమిషాల పాటు నడిచే వారి జ్ఞాపకశక్తి పనితీరు మెరుగుపడినట్టు కనుగొన్నారు.
ఈ అధ్యయనం ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS) లో ప్రచురించబడింది .ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు చిత్తవైకల్యం లేని 120 మంది వృద్ధులు. పరిశోధకులు వారిని రెండు గ్రూపులుగా విడగొట్టి.. వారితో రోజుకు 40 నిమిషాలు, వారానికి మూడు సార్లు వాకింగ్ చేయించారు. మరో బ్యాచ్‌తో ఇతర వ్యాయామాలు చేయించారు. వీరంతా ఏడాది అధ్యయనం తర్వాత తీసుకున్న MRI స్నాన్‌లో ఏరోబిక్ వ్యాయామం చేసిన వ్యక్తులకు ఎడమ, కుడి హిప్పోకాంపస్ వాల్యూమ్ వరుసగా 2.12 శాతం, 1.97 శాతం పెరిగిందని గుర్తించారు.
ఇతర వ్యాయామాలు చేసిన వ్యక్తుల్లో మాత్రం ఎడమ, కుడి హిప్పోకాంపస్‌లో వాల్యూమ్ 1.40, 1.43 శాతం తగ్గినట్టు గుర్తించారు. అలాగే వీరందరికి పరిశోధకులు మూడు విడతల్లో జ్ఞాపకశక్తి పరీక్షలను కూడా నిర్వహించారు. ఇందులో ఏరోబిక్ వ్యాయామం చేసిన వారిలో అధ్యయనానికి ముందుకన్నా.. అధ్యయనం తర్వాత జ్ఞాపకశక్తి పనితీరు మెరుగుపడిందని కనుగొన్నారు. ఇందుకు కారణం మెదడు ఆరోగ్యంతో సంబంధం ఉన్న వివిధ బయోమార్కర్లను పరిశోధకులు గుర్తించారు.
పరిశోదకులు మాట్లాడుతూ.. నడక అన్ని వయసుల వారికి అద్భుతమైన వ్యాయామం, అలాగే ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మానసిక స్థితిని పెంచుతుంది. అలాగే బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల కూడా తగ్గుతాయన్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




