AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ సింపుల్‌ టిప్స్‌తో మీ అందం రెట్టింపు…

ముఖంలో మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఖరీదైన క్రీమ్స్‌ బదులుగా ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల ముఖంలో డార్క్ సర్కిల్స్‌ని దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణుల. వాటిని పాటిస్తే రెండు రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయని అంటున్నారు. అలాంటి సింపుల్స్‌ ఇక్కడ చూద్దాం...

కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ సింపుల్‌ టిప్స్‌తో మీ అందం రెట్టింపు...
Dark Circles
Jyothi Gadda
|

Updated on: May 06, 2025 | 2:59 PM

Share

అందంగా కనిపించాలని ఆడవాళ్లందరూ కోరుకుంటారు. కానీ, అలసట, అధిక ఒత్తిడి, వయసు పెరగడం, జెనెటిక్స్ కారణల వల్ల కొందరు ముఖంలో మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఖరీదైన క్రీమ్స్‌ బదులుగా ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల ముఖంలో డార్క్ సర్కిల్స్‌ని దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణుల. వాటిని పాటిస్తే రెండు రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయని అంటున్నారు. అలాంటి సింపుల్స్‌ ఇక్కడ చూద్దాం…

టమాటా రసం, నిమ్మకాయ: కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టేందుకు టమాటా, నిమ్మరసం ఉపయోగపడుతుంది. టమాటల్లో లైకోపీన్, ఇది ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది పిగ్మంటేషన్‌ని తగ్గిస్తుంది. నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. టమాట జ్యూస్‌లో ఓ టీ స్పూన్‌లో నిమ్మరసం వేసి కళ్ల కింద అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయా

కీరదోసకాయ: దోసకాయ ముక్కలను కళ్ళపై 15 నిమిషాలు ఉంచి తర్వాత తీసేయాలి. ఇవి కంటి చల్లధనాన్ని ఇవ్వడమే కాకుండా నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి. దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పైగా నేచురల్ ఆస్ట్రిజెంట్‌లా పనిచేస్తుంది. ఇందులోని గుణాలు స్కిన్‌ని స్మూత్ అండ్ సాఫ్ట్‌గా చేసి మచ్చలు, వలయాలని దూరం చేస్తాయి. ఇది రోజుకి రెండు సార్లు చేయండి.

ఇవి కూడా చదవండి

ఐస్ క్యూబ్: ఐస్ క్యూబ్ తో కళ్ళ చుట్టూ మసాజ్ చేయడం వలన నల్లటి వలయాలు తగ్గుతాయి. అంతేకాదు.. ఎండాకాలంలో అధిక వేడిమి కారణంగా చర్మం మంటపుడుతుంది. అలాంటప్పుడు ఓ క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ కట్టి చర్మంపై రుద్దుకుంటే.. వేడి నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా సన్ బర్న్ నుంచి కొలుకునేందుకు ఇవి చక్కగా పని చేస్తాయని చర్మ నిపుణులు కూడా చెబుతున్నారు.

కలబంద జెల్: కలబంద జెల్ కళ్ళ చుట్టూ రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి. అలోవెరా జెల్‌లో హైడ్రేటింగ్ గుణాలు ఉన్నాయి. ఇది కూడా డార్క్ సర్కిల్స్‌ని దూరం చేస్తాయి. దీనికోసం కొద్దిపాటు అలోవెరా జెల్‌ని తీసుకుని కళ్ళ కింద, చుట్టూ మసాజ్ చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. రాత్రంతా ఉంచి ఆ తర్వా ఉదయాన్నే క్లీన్ చేసుకోండి. దీంతో కంటి నల్లని వలయాలు మాయమవుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్