Tofu: టోఫు తింటే చికెన్, మటన్ తినాల్సిన పని లేదు.. ఊహించని లాభాలు!

శాఖాహారులు తినాల్సిన ఆహార పదార్థాల్లో టోఫు కూడా ఒకటి. వెజిటేరియన్స్‌ చాలా వరకు పన్నీర్, మష్రూమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే.. టోఫు కూడా ఉంది. టోఫు కూడా చూడటానికి పన్నీర్‌లా కనిపిస్తుంది. కానీ పన్నీర్ రుచి వేరు.. టోఫు రుచి వేరు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. టోఫును సరిగ్గా వండితే.. మటన్, చికెన్ తినాల్సిన పని లేదు. అంత రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మంసాహారం కంటే..

Tofu: టోఫు తింటే చికెన్, మటన్ తినాల్సిన పని లేదు.. ఊహించని లాభాలు!
Tofu
Follow us
Chinni Enni

|

Updated on: Sep 04, 2024 | 1:45 PM

శాఖాహారులు తినాల్సిన ఆహార పదార్థాల్లో టోఫు కూడా ఒకటి. వెజిటేరియన్స్‌ చాలా వరకు పన్నీర్, మష్రూమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే.. టోఫు కూడా ఉంది. టోఫు కూడా చూడటానికి పన్నీర్‌లా కనిపిస్తుంది. కానీ పన్నీర్ రుచి వేరు.. టోఫు రుచి వేరు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. టోఫును సరిగ్గా వండితే.. మటన్, చికెన్ తినాల్సిన పని లేదు. అంత రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మంసాహారం కంటే.. టోఫులో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుత వర్షా కాలంలో మాంసాహారం తినకపోవడమే చాలా మంచిది. అందుకు ప్రత్యామ్నాయంగా టోఫు తినొచ్చు. మరి టోఫు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ ఆరోగ్యం:

టోఫు తినడం వల్ల చర్మ అందంగా తయారవుతుంది. టోఫు.. చర్మంలోని కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు. కాబట్టి వారంలో ఒక్కసారైనా టోఫు తినండి. అలాగే కంప్యూటర్, లాప్ టాప్, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది.

వెయిట్ లాస్:

టోఫు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. బరువు తగ్గాలి అనుకునేవారు టోఫును తినవచ్చు. ఇందులో మొక్కల నుంచి వచ్చిన వాటితో తయారైన పదార్థం ఉంటుంది. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కరిగిస్తుంది. మలబద్ధక సమస్య కూడా ఉండదు. ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్ కూడా ఉంటాయి. కొద్దిగా తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. కాబట్టి బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం:

టోఫు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తవు. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది కాబట్టి.. గుండెకు జరిగే రక్త ప్రసరణ సజావుగా ఉంటుంది. దీంతో రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.

డయాబెటీస్ కంట్రోల్:

టోఫు తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ ఉంటాయి కాబట్టి.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగవు. అయితే మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవాలి.

ఎములకు దృఢంగా:

టోఫు తినడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి.. ఎముకలు గట్టి పడతాయి. తరచూ మీ డైట్‌లో కొద్ది మొత్తంలో చేర్చుంటే.. ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..