AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఫ్రిజ్ సరిగ్గా పనిచేయాలంటే ఈ ట్రిక్స్ తప్పక పాటించండి..!

ఇంట్లో ఫ్రిడ్జ్ వాడటం సహజమే కానీ ఫ్రీజర్‌లో ఐస్ గడ్డ కట్టడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ఫ్రీజర్ తలుపు మూయలేకపోవడం, ఫ్రిజ్ పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు..? మీ ఫ్రిజ్ సరిగ్గా పనిచేయాలంటే పాటించాల్సిన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Hacks: ఫ్రిజ్ సరిగ్గా పనిచేయాలంటే ఈ ట్రిక్స్ తప్పక పాటించండి..!
Fridge Ice Removal
Prashanthi V
|

Updated on: Mar 10, 2025 | 9:01 PM

Share

ఇంట్లో ఫ్రిడ్జ్ వాడటం చాలా సహజమే అయినా దాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రీజర్‌లో ఐస్ గడ్డ కట్టడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఇలా ఐస్ గడ్డ కడితే ఫ్రిజ్ తలుపు సరిగ్గా మూయలేం, అటు ఫ్రిడ్జ్ పనితీరు కూడా తగ్గిపోతుంది. ఫ్రీజర్‌లో ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దాన్ని ఎలా నివారించాలి..? ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిడ్జ్ డోర్ కరెక్ట్ గా మూయకపోతే లోపలికి గాలి వెళ్లి ఫ్రీజర్‌లో నీరు ఐస్‌గా మారిపోతుంది. తరచుగా ఇలా జరిగితే ఫ్రిజ్ లోపలి భాగాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఫ్రిజ్ తలుపుకు ఉండే గాస్కెట్ పాడైతే లోపలికి గాలి ప్రవేశించి ఐస్ గడ్డ కడుతుంది. దీనివల్ల నీరు అడ్డంగా ఐస్‌గా మారి ఫ్రీజర్‌లో నిల్వ ఉంటుంది. దీనిని నివారించాలంటే ఫ్రిజ్ తలుపు సరిగ్గా మూసి ఉందో లేదో గమనించాలి. గాస్కెట్ పాడైతే కొత్తదాన్ని మార్చడం మంచిది.

ఫ్రిడ్జ్‌లో నీరు ఆవిరై బయటకు వెళ్లే కాయిల్ సరిగా పని చేయకపోతే కూడా నీరు ఫ్రీజర్‌లో చేరి ఐస్‌గా మారిపోతుంది. దీన్ని నివారించాలంటే కాయిల్‌ను తరచూ శుభ్రం చేయాలి. అలాగే ఫ్రిడ్జ్‌లోని వాటర్ ఫిల్టర్ పాడైతే కూడా ఫ్రీజర్‌లో ఎక్కువగా ఐస్ గడ్డకడుతుంది. కాబట్టి ఫిల్టర్ పాడైతే వెంటనే మార్చడం ఉత్తమం.

ఫ్రీజర్‌లో ఐస్ గడ్డ కట్టిపోతే తొలగించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ముందుగా ఫ్రిజ్‌ను స్విచ్ ఆఫ్ చేసి, లోపలి భాగాలను శుభ్రం చేసుకోవాలి. వేడి నీరు తీసుకుని ఫ్రీజర్‌లో పోస్తే, ఐస్ వేగంగా కరిగిపోతుంది. ఒక చిన్న పాత్రలో వేడి నీరు పోసి, ఫ్రీజర్‌లో ఉంచి కొద్దిసేపు వదిలేస్తే ఆవిరి వల్ల ఐస్ కరిగిపోతుంది. ఇంకా వేగంగా ఐస్ తొలగించాలంటే హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. ఫ్రీజర్ తలుపు తెరిచి హెయిర్ డ్రైయర్ వేడి గాలి ఊదేలా చేస్తే ఐస్ త్వరగా కరుగుతుంది.

ఫ్రీజర్‌లో ఐస్ తొలగించేటప్పుడు స్టీల్ లేదా ఇనుప చెంచాలు ఉపయోగించకూడదు. అలా చేస్తే ఫ్రీజర్ లోపలి భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెక్క చెంచాలు లేదా ప్లాస్టిక్ పరికరాలు ఉపయోగించడం మంచిది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఫ్రీజర్‌లో ఐస్ గడ్డకట్టకుండా ఉండటంతో పాటు, ఫ్రిజ్ పనితీరు కూడా మెరుగవుతుంది. తరచుగా ఐస్ ఎక్కువగా గడ్డకడితే సమస్య పెద్దదిగా మారకుండా ఫ్రిజ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..