Lifestyle: నిత్యం కాళ్ల నొప్పులా.? గుండె జబ్బు లక్షణం కావొచ్చు..

చాలా సార్లు గుండె జబ్బుల ప్రారంభ లక్షణాల్లో కాళ్ల నొప్పులు కూడా ఉంటాయని అయితే వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక పేర్కొంది. కాళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు గుండె సబంధిత సమస్యలకు ప్రాథమిక లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: నిత్యం కాళ్ల నొప్పులా.? గుండె జబ్బు లక్షణం కావొచ్చు..
Leg Pain
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 01, 2024 | 8:45 PM

కాళ్ల నొప్పులు సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడే ఉంటారు. అయితే వినడానికి కాళ్ల నొప్పులు సహజమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా కాళ్ల నొప్పులు గుండె పోటు రావడానికి ప్రాథమిక లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చాలా సార్లు గుండె జబ్బుల ప్రారంభ లక్షణాల్లో కాళ్ల నొప్పులు కూడా ఉంటాయని అయితే వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక పేర్కొంది. కాళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు గుండె సబంధిత సమస్యలకు ప్రాథమిక లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ గుండెకు, కాళ్లకు మధ్య ఉండే సంబంధం ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..

సాధారణంగా భుజం, వెన్నునొప్పి, విపరీతమైన అలసట, కడుపు నొప్పి, పుల్లని త్రేనుపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు నిరంతరం నొప్పి, వాంతులు మరియు మైకము, అధిక చెమట వంటివి గుండె సంబంధిత వ్యాధులకు ప్రాథమిక లక్షణాలు చెబుతుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గుండెకు పాదాల మధ్య లోతైన సంబంధం ఉంటుందని చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు పాదాలతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

ఇది రక్తం పంపింగ్‌, ధమనుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గడం వల్ల వాపునకు కారణమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాళ్ల నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. కరోనరీ ఆర్టరీ వ్యాధినివల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు ఇది కాళ్లపై ప్రభావితం చూపుతుందని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..