Sankranti 2024: మెహిందీ ఎర్రగా పండాలా.. ఈ ఈజీ టిప్స్ మీకోసమే!

పండుగలు, ఫంక్షన్స్, పెళ్లిళ్లు ఇలా ఏమి వచ్చినా చేతులకు గోరింటాకు లేదా మెహిందీ పెట్టుకోవాల్సిందే. గోరింటాకు అందరికీ లభ్యమవదు. దానికి తోడు గోరింటాకు కోయడం, రుబ్బడం అంటే చాలా పనితో కూడుకున్నది. దీంతో చాలా మంది మెహిందీ పెట్టుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు పెట్టుకోవాలన్నా క్షణాల్లో కొనుక్కుని.. మంచి మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చు. కానీ గోరింటాకుతో అన్ని డిజైన్స్ రావు. సన్నంగా కూడా రాదు. దీంతో యూత్ అందరూ పెళ్లి, ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, పండుగులు ఏవైనా..

Sankranti 2024: మెహిందీ ఎర్రగా పండాలా.. ఈ ఈజీ టిప్స్ మీకోసమే!
Mehndi
Follow us
Chinni Enni

| Edited By: TV9 Telugu

Updated on: Jan 16, 2024 | 1:13 PM

పండుగలు, ఫంక్షన్స్, పెళ్లిళ్లు ఇలా ఏమి వచ్చినా చేతులకు గోరింటాకు లేదా మెహిందీ పెట్టుకోవాల్సిందే. గోరింటాకు అందరికీ లభ్యమవదు. దానికి తోడు గోరింటాకు కోయడం, రుబ్బడం అంటే చాలా పనితో కూడుకున్నది. దీంతో చాలా మంది మెహిందీ పెట్టుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు పెట్టుకోవాలన్నా క్షణాల్లో కొనుక్కుని.. మంచి మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చు. కానీ గోరింటాకుతో అన్ని డిజైన్స్ రావు. సన్నంగా కూడా రాదు. దీంతో యూత్ అందరూ పెళ్లి, ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, పండుగులు ఏవైనా మెహిందీనే పెట్టుకుంటున్నారు.

పెట్టుకోవడం వరకూ ఎలా ఉన్నా.. పెట్టుకున్న మెహిందీ పండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంత మందికి మెహిందీ అస్సలు పండదు. దీంతో నిరుత్సాహ పడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల చిట్కాలు ప్రయోగిస్తే మెహిందీ ఎర్రగా పండుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో చూద్దాం.

చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి..

మెహిందీ పెట్టుకోవాలి అనుకునే వారు ముందు శుభ్రంగా చేతులను క్లీన్ చేసుకోవాలి. దాంతో చేతులపై ఉండే మురికి పోతుంది. తర్వాత చక్కగా మెహిందీ పెట్టుకోవచ్చు. దీంతో మెహిందీ పెట్టుకున్నా ఎర్రగా పండుతుంది.

ఇవి కూడా చదవండి

మాయిశ్చరైజర్ రాసుకోవాలా.. వద్దా..

చాలా మంది మెహిందీ పెట్టుకునేటప్పుడు చేతుల పాడైపోతాయని.. మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు. మెహిందీ పెట్టుకునే వాళ్లు ఎప్పుడూ మాయిశ్చరైజర్ రాసుకోకూడదు. క్రీమ్స్‌లో ఉండే కెమికల్ రియాక్షన్స్.. మెహిందీ పండకుండా చేస్తాయి.

మెహిందీ బాగా ఆరనివ్వాలి..

మెహిందీ పెట్టుకున్నాక బాగా ఆరనివ్వాలి. తడి మెహిందీపై ఎలాంటివి అప్లూ చేయకూడదు. పెట్టుకున్నాక నార్మల్‌గా ఆర నివ్వాలి. అదే విధంగా పూర్తిగా ఆరాకనే మెహిందీ కడిగేసుకోవాలి. లేదంటే సరిగా పండదు.

పంచదార – నిమ్మ రసం..

చేతులకు పెట్టుకున్న మెహిందీ ఎర్రగా పండాలంటే నిమ్మ రసం, పంచదార బాగా సహాయ పడతాయి. ఇందుకోసం ముందుగా నిమ్మ రసం తీసుకుని అందులో కొద్దిగా పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆరిపోయిన మెహిందీపై అప్లై చేయాలి. దీని వల్ల మంచి రంగు వస్తుంది.

లవంగాల పొగ..

మెహిందీ బాగా పండాలంటే.. లవంగాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. తాలింపు పెట్టుకునే పాన్ లేదా దోశల పాన్ అయినా తీసుకుని.. సిమ్‌లో లవంగాలను బాగా ఫ్రై చేయాలి. అవి బాగా వేగితే.. పొగ వస్తుంది. ఆ పొగపై మెహిందీ పెట్టుకున్న చేతులు పెట్టండి. దీని వల్ల మంచి బ్రైట్ కలర్ వస్తుంది.