AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్ చిప్స్ తింటే అంతే సంగతులు..!

ఇటీవల చాలామంది పిల్లలు హాట్ చిప్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా స్నాక్స్ గా పెట్టడానికి పెద్ద పెద్ద హాట్ చిప్స్ సంచులను కొని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. కానీ ఆ హాట్ చిప్స్ వల్ల పిల్లల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని గ్రహించలేకపోతున్నారు. హాట్ చిప్స్ తింటూ.. కోక్ తాగితే.. మజాగానే ఉంటుంది.. కానీ అదేపనిగా రోజు తింటే మీరు హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం. అవునండీ.  ఇది నిజం.! తమిళనాడులోని నెహ్రు చిల్డ్రన్స్ […]

హాట్ చిప్స్ తింటే అంతే సంగతులు..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:45 PM

Share

ఇటీవల చాలామంది పిల్లలు హాట్ చిప్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా స్నాక్స్ గా పెట్టడానికి పెద్ద పెద్ద హాట్ చిప్స్ సంచులను కొని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. కానీ ఆ హాట్ చిప్స్ వల్ల పిల్లల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని గ్రహించలేకపోతున్నారు.

హాట్ చిప్స్ తింటూ.. కోక్ తాగితే.. మజాగానే ఉంటుంది.. కానీ అదేపనిగా రోజు తింటే మీరు హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం. అవునండీ.  ఇది నిజం.! తమిళనాడులోని నెహ్రు చిల్డ్రన్స్ హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చిన చాలామంది చిన్నారులు హాట్ చిప్స్ బాధితులేనట. ఆ చిన్నారులకు జరిపిన ‘టెస్ట్’ రిపోర్ట్స్ లో.. కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఆ ఆసుపత్రికి వచ్చిన చిన్నారుల్లో కనీసం సగం మంది హాట్ చిప్స్ వల్ల సమస్యలు ఎదురుకున్న వారేనట. కడుపు నొప్పి, రక్తపు వాంతులు, మలం, మూత్రం నుంచి రక్తం రావడం వంటి సమస్యలతో వస్తున్నారట. అయితే వారు వాంతు చేసుకునేది రక్తం కాదని.. హాట్ చిప్స్ లో వేసే ఎర్ర రంగని వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు ఆ బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు.. వారు ఏమి తింటున్నారో కూడా తెలియదట.

మరోవైపు ఇది పిల్లలకు మాత్రమే కాదు అటు పెద్దవాళ్ళకు కూడా ఈ సమస్య వెంటాడుతోంది. ఎసిడిటీ రూపంలో వారికీ పెద్ద సమస్యే ఎదురవుతోంది. అయితే పిల్లలు చిన్నప్పటి నుండే ఈ ఆహారాన్ని తిన్నట్లు అయితే దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికే వీటిపై FDA కు ఫిర్యాదులు అందాయి. అయితే ఈ ఫిర్యాదులు తక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో హాట్ చిప్స్ అమ్మే సంస్థలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం హాట్ చిప్స్ వల్ల తమ పిల్లలకు సమస్య వచ్చినా.. FDA కు ఫిర్యాదు చేయాలనే ఆలోచన కలగడం లేదు వారి తల్లిదండ్రులకు.

Follow Us
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా