Health: పడుకోగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? స్లీప్ యాంగ్జైటీ కావొచ్చు..
నిద్రకు ఉపక్రమించగానే ఆందోళన, భయం వంటివి ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో గుండె కొట్టుకోవడంలో వేగంగా పెరుగుతుంది. ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి, తీవ్ర ఆందోళన వెంటాడుతుంది. అప్పటి వరకు ఉన్న నిద్ర కాస్త పరార్ అవుతుంది. మనలో చాలా మంది ఇలాంటి సమస్య ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి ఉన్న సమయంలో ఇలా జరిగితే పర్వాలేదు కానీ...

కంటి నిండ నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతుంటారు. అప్పటి వరకు బాగానే ఉన్నా, నిద్రకు ఉపక్రమించే సరికి ఏదో తెలియని ఆందోళన వెంటాడుతంది. ఎంత సేపు ప్రయత్నించిన నిద్ర పట్టదు. పడుకోగానే తెలియని ఏవో నెగిటివ్ ఆలోచనలు వెంటాడుతుంటాయి.
నిద్రకు ఉపక్రమించగానే ఆందోళన, భయం వంటివి ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో గుండె కొట్టుకోవడంలో వేగంగా పెరుగుతుంది. ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి, తీవ్ర ఆందోళన వెంటాడుతుంది. అప్పటి వరకు ఉన్న నిద్ర కాస్త పరార్ అవుతుంది. మనలో చాలా మంది ఇలాంటి సమస్య ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి ఉన్న సమయంలో ఇలా జరిగితే పర్వాలేదు కానీ, ప్రతీ రోజూ జరిగితే మాత్రం అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
పడుకునే సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే బహుశా ఇది.. స్లీప్ యాంగ్జైటీ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. పడుకునేందుకు బెడ్‌పైకి వెళ్లగానే.. గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఇది స్లీప్ యాంగ్జైటీ లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇక మరికొందరిలో గుండెల్లో నొప్పి, నీరసం, వికారంగా అనిపించడం, గుండె దడ పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే ఇలాంటి లక్షణాలు దీర్ఘాకాలంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. స్లీప్ యాంగ్జైటీ నుంచి బయటపడేందుకు మందులతో పాటు చికిత్సను అందించే మానసిక వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. వీరి సూచనలు పాటించడం ద్వారా స్లీప్ యాంగ్జైటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అయితే వైద్యులను సంప్రదించేకంటే ముందే.. ఇంట్లో కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు
ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారు మధ్యాహ్నం కునుకు తీయడం ఆపేయాలి. రాత్రి వీలైనంత వరకు త్వరగా భోజనం చేయాలి. పడుకునే కంటే రెండు కనీసం మూడు గంటల ముందు భోజనం పూర్తి చేసుకోవాలి. అలాగే రాత్రుళ్లు టీ, కాఫీల్లాంటి వాటిని తీసుకోకడదు. ఎట్టి పరిస్థితుల్లో ధూమపానం అలవాటుకు దూరంగా ఉండాలి. శారీరక వ్యాయామంతో పాటు, ఎడిటేషన్, యోగా వంటి అలవాటు చేసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువ చేసే రాత్రి అలసిపోయి త్వరగా నిద్ర పడుతుంది. అలాగే వీలైనంత వరకు రోజులో ఒకే సమయంలో పడుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సలహాలు, సూచనలను పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
