AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Hair: యువతలో పెరుగుతున్న తెల్ల జుట్టు సమస్య.. నల్లగా మారడానికి ఏం తినాలో తెలుసా..?

తెల్ల జుట్టుతో యువత నామోషీగా ఫీల్ అవుతున్నారు. అయితే తెల్ల జట్టుకు కారణం శరీరంలో అవసరమైన విటమిన్ లేకపోవడం కావచ్చు. ఏ విటమిన్ లోపం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది..? ఈ లోపాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకోవడం ముఖ్యం. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

White Hair: యువతలో పెరుగుతున్న తెల్ల జుట్టు సమస్య.. నల్లగా మారడానికి ఏం తినాలో తెలుసా..?
White Hair Causes, Remedies & Vitamin Deficiency
Krishna S
|

Updated on: Sep 11, 2025 | 2:42 PM

Share

ప్రస్తుత కాలంలో యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు. గతంలో వృద్ధాప్యానికి సంకేతంగా భావించే ఈ సమస్య ఇప్పుడు యువతలోనూ వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలుగా పోషకాహార లోపం, చెడు జీవనశైలి, ఒత్తిడి, జంక్ ఫుడ్‌ను నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12 లోపం తెల్ల జుట్టు సమస్యకు ప్రధాన కారణంగా చెప్తారు. అయితే సరైన ఆహారం, కొన్ని ఇంటి నివారణలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

విటమిన్ డి లోపం

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఇది ఎముకల ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా చాలా కీలకం. విటమిన్ డి లోపం వల్ల జుట్టు బలహీనపడి, త్వరగా తెల్లగా మారుతుంది.

విటమిన్ డి లభించే వనరులు:

సూర్యరశ్మి: విటమిన్ డికి అతిపెద్ద వనరు సూర్యరశ్మి. రోజూ కనీసం 15 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది.

ఆహార పదార్థాలు: పాలు, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, గుడ్లు, కొవ్వు చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.

విటమిన్ బి12 లోపం – జుట్టు నెరవడం

విటమిన్ బి12 జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు రాలడం, త్వరగా నెరవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

విటమిన్ బి12 లభించే వనరులు:

పాల ఉత్పత్తులు: గుడ్లు, పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది.

మాంసాహారాలు: మాంసం, చేపలు వంటివి విటమిన్ బి12కు మంచి వనరులు. మాంసాహారం తినేవారికి ఇది ఉత్తమ ఎంపిక.

తెల్ల జుట్టును నివారించడానికి ఇంటి చిట్కాలు

పోషకాహారంతో పాటు కొన్ని సహజ నివారణలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి.

కొబ్బరి నూనె – నిమ్మకాయ: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు క్రమంగా నల్లగా అవుతుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఈ నివారణలు, ఆహారంలో సరైన పోషకాలను చేర్చుకోవడం ద్వారా అకాల తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!