AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reverse Walking: వెనక్కి నడిస్తే మీకు సూపర్ బెనిఫిట్స్..

సాధారణంగా ముందుకు నడిచే కంటే వెనక్కి నడవడం వల్ల వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముందుకు వెయ్యి అడుగులు నడిచినా, వెనక్కి వంద అడుగులు నడిచినా ఒకటేనని చెబుతున్నారు. బయోమెకానిక్స్‌లో మార్పుల కారణంగా.. రివర్స్-వాకింగ్ వల్ల కొన్ని అధికంగా...

Reverse Walking: వెనక్కి నడిస్తే మీకు సూపర్ బెనిఫిట్స్..
Reverse Walking
Ranjith Muppidi
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 09, 2024 | 4:23 PM

Share

వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతలా మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యంతో వైద్యుడి దగ్గరకి వెళ్తే ముందుగా చెప్పేది ఉదయం వాకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకోమని. వాకింగ్‌ వల్ల అలాంటి లాభాలు ఉంటాయి కాబట్టే వైద్యులు సూచిస్తుంటారు. అయితే వాకింగ్‌ అనగానే సహజంగానే ముందుకు నడవడం అని అనుకుంటాం. అయితే కేవలం ముందుకు మాత్రమే కాకుండా వెనక్కి కూడా నడవడం వల్ల మరెన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ముందుకు నడిచే కంటే వెనక్కి నడవడం వల్ల వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముందుకు వెయ్యి అడుగులు నడిచినా, వెనక్కి వంద అడుగులు నడిచినా ఒకటేనని చెబుతున్నారు. బయోమెకానిక్స్‌లో మార్పుల కారణంగా.. రివర్స్-వాకింగ్ వల్ల కొన్ని అధికంగా లాభాలు ఉంటాయి. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు రివర్స్ వాకింగ్‌తో చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ రివర్స్ వాకింగ్‌ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రివర్స్ వాకింగ్‌ వల్ల గుండె, జీవక్రియకు ఎంతో ఉపయోగమని నిపుణులు చెబుతున్నారు. రివర్స్‌లో నడవడం వల్ల గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేస్తుంది. దీంతో శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌, రక్తం సరఫరా సజావుగా సాగుతుంది. ముఖ్యంగా మెదడులోని కణాలకు ర్తం సరఫరా మెరుగ్గా ఉండడం వల్ల మానసిక సమస్యలకు కూడా చెక్‌ పెట్టొచ్చు. రివర్స్‌ వాకింగ్‌ వల్ల గుండె సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలోని గార్డనర్ న్యూరోసైన్స్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు చెబుతున్నారు.

వెనక్కి నడవడం వల్ల అవయవాల సమతుల్యత మెరుగుపడుతుందని, మోకాలిలో ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా చెప్పాలి. రివర్స్‌ వాకింగ్‌తో ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగవుతుంది. అలాగే.. ఇన్సులిన్‌ను కంట్రోల్‌లో ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రివర్స్ వాకింగ్‌ వల్ల ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..