Brain Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన గంటలో ఏం చేయాలి.? ప్రాణాలు కాపాడుకోవాలంటే

ఈ సమస్య కారణంగా శాశ్వత పక్షవాతంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్రెయిన్‌ స్ట్రోక్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. అయితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటి ఆధారంగా...

Brain Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన గంటలో ఏం చేయాలి.? ప్రాణాలు కాపాడుకోవాలంటే
Brain Stroke
Follow us

|

Updated on: Jul 22, 2024 | 11:20 AM

ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తక్కువ వయసు ఉన్న వారిలో కూడా ఇలాంటి ప్రమాదకర వ్యాధులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక బ్రెయిన్‌ స్ట్రోక్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలిలో మార్పుల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒత్తిడితో కూడుకున్న జీవితం, తీవ్రమైన రక్తపోటు సమస్యల కారణంగా కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది.

ఈ సమస్య కారణంగా శాశ్వత పక్షవాతంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్రెయిన్‌ స్ట్రోక్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. అయితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటి ఆధారంగా ఈ వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి.? బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన మొదటి గంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు..

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ముఖం కనిపించే మార్పులు. ముఖం ఒకవైపు లాగుతున్నట్లు అనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. అలాగే ఏదో ఒక చేయి బలహీనంగా మారినా బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణంగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. బరువు ఎత్తలేకపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మాట్లాడడంలో ఇబ్బందిగా ఉన్నా, మాటలు స్పష్టంగా రాకపోయినా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో దృష్టిలోపం కూడా ఒక లక్షణమని నిపుణులు అంటున్నారు. కళ్లు మసకబారుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలంగా తలనొప్పి వేధిస్తున్నా, నడవడంలో ఇబ్బందిగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

మొదటి గంటలో చేయాల్సిన పనులు..

బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అనవసరంగా భయపకుండా రోగిని ప్రశాంతంగా ఉంచాలి. బాధిత వ్యక్తి తలపైకి లేపి విశ్రాంతి తీసుకోమని చెప్పాలి. దీనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ సమయంలో రోగికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం లేదా లిక్విడ్ ఇవ్వకూడదు, దీనివల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రక్త ప్రవాహం ఒక్కసారిగా పెరగడం వల్లే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట ప్రశాంతంగా ఉండాలి. అనంతరం వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..