AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: మాన్‌సూన్‌ డిప్రెషన్‌ అంటే ఏంటీ.? దీని లక్షణాలు ఎలా ఉంటాయి.?

సాధారణంగా వర్షాకాలంలో సూర్యరక్ష్మి పూర్తిగా తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా మారుతుంది. దీంతో ఉదయం లేవడానికి బద్ధకిస్తుంటాం. అలాగే మనలో ఉత్తేశాన్ని నింపే సూర్యరక్ష్మి లేకపోవడం వల్ల డల్‌గా ఉంటుంది. ఎక్కువ కాలం సూర్యకాంతి లేని కారణంగా డిప్రెషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. సూర్యరక్ష్మి లభించని కారణంతో...

Monsoon: మాన్‌సూన్‌ డిప్రెషన్‌ అంటే ఏంటీ.? దీని లక్షణాలు ఎలా ఉంటాయి.?
Monsoon Depression
Narender Vaitla
|

Updated on: Jul 22, 2024 | 10:44 AM

Share

ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేకుండా వనాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అయితే సాధారణంగా వాతావరణం ఇలా మారితే వ్యాధులు వస్తాయనే విషయం తెలిసిందే. అయితే ఇలా వర్షాలు కురవడం, వాతావరణం చల్లాగా మారడం వల్ల శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే మాన్‌సూన్‌ డిప్రెషన్‌గా చెబుతుంటారు. ఇంతకీ ఈ సమస్యలో కనిపించే లక్షణాలు ఏంటి.? దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా వర్షాకాలంలో సూర్యరక్ష్మి పూర్తిగా తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా మారుతుంది. దీంతో ఉదయం లేవడానికి బద్ధకిస్తుంటాం. అలాగే మనలో ఉత్తేశాన్ని నింపే సూర్యరక్ష్మి లేకపోవడం వల్ల డల్‌గా ఉంటుంది. ఎక్కువ కాలం సూర్యకాంతి లేని కారణంగా డిప్రెషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. సూర్యరక్ష్మి పడని కారణంతో శరీరంలో సెరోటోన్‌ స్థాయిలను నియంత్రణ జరగదు. సెరోటిన్ ఉత్పత్తికి అంతరాయం జరిగితే మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది.

ఇక సూర్యకాంతి లేని కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్‌ డీ కూడా సరిపడ లభించదు. దీంతో డిప్రెషన్‌, ఆందోళన వంటి లక్షణాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వర్షం పడుతుండడం వల్ల శారీరక కార్యకలాపాలు కూడా తగ్గుతాయి. ఇది కూడా మానిసక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వర్షం కారణంగా బయటకు వెళ్లడం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురితో కలిసి ఉండకపోవడం వల్ల కూడా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలా బయటపడాలంటే..

ఈ మాన్‌సూన్‌ డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వర్షం పడుతోందన్న కారణంగా వ్యాయామం చేయడాన్ని ఆపకూడదు ఇంట్లోనైనా కనీసం 15 నుంచి 20 నిమిషాలు కచ్చితంగా వర్కవుట్స్‌ చేయాలి. ఇక రాత్రి సరైన నిద్రలేక పోతే రోజంతా దాని ప్రభావం ఉంటుంది. ఇది కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కచ్చితంగా రాత్రుళ్లు సరిపడ నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇక శారీరకంగా ఇతరులతో కలిసే వీలు లేకపోయినా వర్చువల్‌గా అయినా మాట్లాడాలి. రోజులో కొద్ది సేపైనా ఇతరులకు ఫోన్‌ చేసి మాట్లాడడం మర్చిపోకూడదు. ఇలాంటివి చేయడం వల్ల మాన్‌సూన్‌ డిప్రెషన్‌ నుంచి బయటపడొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..