AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty: ఆపిల్‌ తొక్కతో అద్భుతం.. అందమైన రూపం మీ సొంతం..

రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజూ యాపిల్ తింటే వైద్యుల దగ్గరికీ వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు సైతం చెబుతుంటారు. యాపిల్‌లో ఉండే పోషకాలు అలాంటివి మరి. ఎన్నో రకాల సమస్యలకు యాపిల్‌ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే ఆపిల్‌ పండుతో మాత్రమే కాకుండా....

Beauty: ఆపిల్‌ తొక్కతో అద్భుతం.. అందమైన రూపం మీ సొంతం..
Apple Peel
Narender Vaitla
|

Updated on: Jul 22, 2024 | 11:49 AM

Share

రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజూ యాపిల్ తింటే వైద్యుల దగ్గరికీ వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు సైతం చెబుతుంటారు. యాపిల్‌లో ఉండే పోషకాలు అలాంటివి మరి. ఎన్నో రకాల సమస్యలకు యాపిల్‌ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే ఆపిల్‌ పండుతో మాత్రమే కాకుండా ఆపిల్‌ తొక్కతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఆపిల్‌ తొక్క కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మ సౌందర్యానికి కూడా ఆపిల్‌ తొక్కలు ఉపయోగపడతాయి. యాపిల్‌ తొక్కల చేసే పీల్‌ ఫేస్‌ ప్యాక్‌తో చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయొచ్చు. ఇంతకీ ఫేస్‌ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపిల్‌ తొక్కతో ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవడానికి ముందుగా.. పండు నుంచి తొక్కలను తీయాలి. అనంతరం తొక్కలను కొన్ని రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి. అనంతరం తొక్కలు బాగా ఎండిన తర్వాత వాటిని పొడిగా చేసుకోవాలి. అనంతరం రెండు చెంచాల పౌడర్‌కు ఒక చెంచా మెత్తగా రుబ్బిన ఓట్‌ మీల్‌ పౌడర్‌ను యాడ్‌ చేయాలి. అనంతరం ఇందులో కొంచెం తేనెను కలపి ఒక పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంతో పాటు ముఖమంతా అప్లై చేయాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

ఇక యాపిల్ తొక్కలతో మరో రకంగా కూడా ఫేస్‌ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల యాపిల్‌ తొక్క పొడిని తీసుకోవాలి. అనంతరం అందులో కొంచెం పాలను యాడ్‌ చేసి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంతో పాటు, మెడపై అప్లై చేసి 20 నిమిషాలపాటు మసాజ్‌ చేయాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్‌గా మారుతుంది. యాపిల్‌ తొక్కలోని విటమిన్‌ ఎ, సి, ఇ, కెలు చర్మాన్ని తేమగా మార్చడంలో ఉపయోగడపతాయి. అలాగే మచ్చలు, మొటిమలు తగ్గడంలో ఉపయోగతాయి. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ