AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: చపాతీ vs రైస్.. డిన్నర్‌లోకి ఏది మంచిది.. ఏది తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది

Diabetics Dinner Guide: మారుతున్న జీవనశైలితో జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో డయాబెటిస్ కూడా ఒకటి. ఒకప్పుడు కేవలం వయస్సు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువకుల్లో కూడా కనిపిస్తుంది. అయితే దీన్ని నియంత్రించేందుకు సరైన ఆహారం ఎంతో ముఖ్యం. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు డిన్నర్‌లోకి అన్నం లేదా చపాతీ ఏది తినడం ఉత్తమమో ఇక్కడ తెలుసుకుందాం.

Diabetes Diet: చపాతీ vs రైస్.. డిన్నర్‌లోకి ఏది మంచిది.. ఏది తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది
Diabetes Diet
Anand T
|

Updated on: Jan 15, 2026 | 12:49 PM

Share

మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్‌ స్టైల్ కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో చాలా మంది ఫేస్ చేసే ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటై సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటీస్ ఉన్నవారు నైట్ డిన్నర్‌లోకి చపాతీ, రైస్ తినే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. వీటని తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుతాయని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండు ఆహారాలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని సరైన క్రమంలో తీసుకుంటే రెండు ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటాయని వారు చెబుతున్నారు.

రైస్ వర్సెస్ చపాతి

ఒక కప్పు రైస్‌లో దాదాపు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండగా , చపాతీలో దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యం కంటే చపాతీలో దాదాపు 2 గ్రాముల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలో బియ్యం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక చపాతీలో దాదాపు 71 కేలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాముల కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యంలో గోధుమ కంటే భాస్వరం, మెగ్నీషియం తక్కువగా ఉంటుంది. ఇది ఫోలేట్, ఐరన్ రెండింటిలోనూ సమానంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు రెండింటినీ తినవచ్చు. కానీ వాటిని సరైన పరిమాణంలో తీసుకోవడం మఖ్యం.

చపాతీ వల్ల ప్రయోజనాలు

చపాతీలు తినడం వల్ల అన్నం మోతాదును నియంత్రించడం సులభం అవుతుంది. రెండు చపాతీలతో భోజనం ముగించడం ఉత్తమం. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి మిశ్రమ ధాన్యాలతో తయారు చేసిన చపాతీలలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. శుద్ధి చేయని, తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన తృణధాన్యాల పిండిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు .

డిన్నర్‌కి ఏది బెస్ట్?

  • బరువు తగ్గాలనుకుంటే, డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి చపాతీ బెటర్ ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్ వల్ల రాత్రి ఆకలి తక్కువ వస్తుంది, రక్తంలో చక్కెర స్థాయి స్టెబుల్‌గా ఉంటుంది.
  • మీకు రాత్రి త్వరగా నిద్ర పట్టాలనుకుంటే రైస్ తినడం ఉత్తమం. ఎందుకంటే రైస్‌లో అధిక GI వల్ల ట్రిప్టోఫాన్ వేగంగా మెదడుకి వెళ్లి నిద్ర మెరుగవుతుంది.
  • బ్లడ్ ప్రెషర్, కిడ్నీ సమస్యలు ఉన్న వారికి రాత్రి భోజనంలోకి రైస్ తినడం మంచింది. ఎందుకంటే ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది.
  • మీరు సాధారణ ఆరోగ్యం కోసం అయితే చపాతీ ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది.
  • మొత్తాన్ని డిన్నర్‌కి చాలా మందికి చపాతీ ఆరోగ్యానికి బెస్ట్. కానీ మీ శరీరం ఏది బాగా స్వీకరిస్తుందో, ఏది తిన్నాక బాగా ఫీల్ అవుతుందో అదే బెస్ట్. రెండూ మితంగా తినడమే మంచింది.

(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడిని.. ఇవి ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన సమాచారం నుంచి అందిస్తున్నాం. కాబట్టి వీటిపై మీకేవైసా సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

మరిన్నిలైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.