AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహం రాకముందే.. లైఫ్ స్టైల్ ఛేంజ్ చేసుకుంటే.. గుడ్ హెల్త్..

ప్రపంచంలో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకసారి శరీరంలోకి షుగర్ వ్యాధి ఎంటర్ అయితే దానిని నియంత్రించుకోవడం తప్ప.. మన నుంచి ఆ వ్యాధిని దూరం చేయలేమని వైద్య నిపుణులు..

Diabetes: మధుమేహం రాకముందే.. లైఫ్ స్టైల్ ఛేంజ్ చేసుకుంటే.. గుడ్ హెల్త్..
Diabetes
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 30, 2022 | 2:07 PM

ప్రపంచంలో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకసారి శరీరంలోకి షుగర్ వ్యాధి ఎంటర్ అయితే దానిని నియంత్రించుకోవడం తప్ప.. మన నుంచి ఆ వ్యాధిని దూరం చేయలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం డయాబెటిక్ బారిన పడకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ రోజుకు డయాబెటిక్ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. భవిష్యత్తులో దాని బారిన పడకూడదంటే.. ఇప్పటినుంచే మెరుగైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం వంటి వ్యాధి శరీరంలో వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు.. శరీరంలో అనేక ఇతర శారీరక వ్యాధులు కూడా వస్తాయి. అందుకే మధుమేహానికి దూరంగా ఉండాలి. లైఫ్ స్టైల్ లో మార్పులతోమధుమేహనికి చెక్ పెట్టవచ్చని అంటున్నారు. మధుమేహం నుంచి బయటపడటానికి మొదటి మార్గం బరువు తగ్గడం. ఊబకాయం ఉన్నవాళ్లు త్వరగా మధుమేహం బారిన పడతారు. బరువు తగ్గడం వల్ల మధుమేహాన్ని 60 శాతం తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం, వ్యాయామం ద్వారా మీ శరీర బరువులో 7 శాతం కోల్పోవడం.. మధుమేహం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. కానీ అధిక కొవ్వు లేదా అధిక బరువు ఉన్నట్లయితే.. దానిని తగ్గించే దిశగా వెళ్లడం బెటర్ అంటున్నారు వైద్యులు.

ఒక వ్యక్తి ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు చేసుకున్నట్లయితే లేదా రోజంతా కూర్చొని పని చేస్తే కనీసం రోజుకు ఒక్కసారైనా నడవడం అవసరం. రోజంతా పనిలో ఉండి శరీర భాగాలను కదిలిస్తే లావు పెరిగే అవకాశం ఉండదు. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాం రాకుండా కూడా దోహదపడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా చాలా ప్రధానమైనది. ఆహారంలో కూరగాయలు ఉండాలి. బ్రోకలీని తింటే మరింత మంచిది. అలాగే ఆహారంలో పండ్లు, బీన్స్, చిక్పీస్ ఉండాలి. ఆహారంలో బియ్యం, ఓట్స్, క్వినోవా వంటివి చేర్చుకోవడం వల్ల మధుమేహంతో పాటు అనేక ఇతర వ్యాధులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అసంతృప్త కొవ్వుని మంచి కొవ్వు అంటారు. ఇది శరీరానికి మంచిది. కొన్నిసార్లు ఇది మధుమేహాన్ని నివారించే ప్రక్రియలో సహాయపడుతుంది. ఈ సందర్భంలో ఆలివ్ నూనె ఉపయోగించడం మంచిది. మాంసం, పాల ఉత్పత్తులను కనిష్టంగా ఉపయోగించడం మంచిది. అయితే ఆహార అలవాట్లలో మార్పులు చేసుకునేటప్పుడు వైద్య నిపుణులు సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

ఇంట్లో గాజు పగిలితే ఎటువంటి శకునమో తెలుసా..
ఇంట్లో గాజు పగిలితే ఎటువంటి శకునమో తెలుసా..
గురువు పాదాలకు కోహ్లీ నమస్కారం! ఫ్యాన్స్ ఫిదా
గురువు పాదాలకు కోహ్లీ నమస్కారం! ఫ్యాన్స్ ఫిదా
జెమినీ ఏఐ సేవలను విస్తరించనున్న గూగుల్.. యూజర్లకు మరింత ప్రయోజనం
జెమినీ ఏఐ సేవలను విస్తరించనున్న గూగుల్.. యూజర్లకు మరింత ప్రయోజనం
కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
మేడం సార్‌.. మేడం అంతే! 70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే..
మేడం సార్‌.. మేడం అంతే! 70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే..
TGPSC గ్రూప్‌ 1పై HCలో తప్పుడు అఫిడవిట్‌.. పిటిషనర్లకు జరిమానా!
TGPSC గ్రూప్‌ 1పై HCలో తప్పుడు అఫిడవిట్‌.. పిటిషనర్లకు జరిమానా!
ఉగ్రవాదానికి బిర్యానీతో కాదు, బుల్లెట్లతో బుద్ధి: బీజేపీ
ఉగ్రవాదానికి బిర్యానీతో కాదు, బుల్లెట్లతో బుద్ధి: బీజేపీ
వర్షాల కోసం సోమయాగం పరిశోధన కోసం ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తల
వర్షాల కోసం సోమయాగం పరిశోధన కోసం ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తల
ఏసీ అవసరం లేదు.. ఇంటిని కూల్ చేయడానికి ఈ టిప్స్ తెలిస్తే చాలు..
ఏసీ అవసరం లేదు.. ఇంటిని కూల్ చేయడానికి ఈ టిప్స్ తెలిస్తే చాలు..
బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై..
బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై..