AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Chapati: షుగర్‌ పేషెంట్లు..ఇవన్నీ కలిపి చపాతీ చేసుకొని తిన్నారంటే…మందులకన్నా రెట్టింపు లాభాలు..

కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్‌ చేసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది.. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఇలా చెప్పిన పదార్థాలు అన్నీ కలిపి చపాతీ పిండి తయారు చేసుకుని.. దాంతో చపాతీ చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ చపాతీ పిండిలో కలపడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు.

Diabetic Chapati: షుగర్‌ పేషెంట్లు..ఇవన్నీ  కలిపి చపాతీ చేసుకొని తిన్నారంటే...మందులకన్నా రెట్టింపు లాభాలు..
Diabetic Chapati
Jyothi Gadda
|

Updated on: Jul 11, 2025 | 4:15 PM

Share

డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది ఈ డయాబెటిస్ బారినపడుతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సరైన జీవన శైలి, ఆహార అలవాట్లతో డయాబెటిస్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు అన్నీ కలిపి చపాతి చేసుకొని తింటే.. అదే షుగర్ పేషెంట్స్ కి ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు.

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు ఏ ఆహారాన్ని ప‌డితే దాన్ని తిన‌కూడ‌దు. ఆహారం విష‌యంలో చాలా జాగ్రత్తగా ఉంటూ అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా బ‌రువును త‌గ్గించుకోవాలి. దీంతో ఆటోమేటిగ్గా షుగ‌ర్ కూడా కంట్రోల్ అవుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు చ‌పాతీల‌ను తినాలని సూచిస్తుంటారు. ఎందుకంటే గోధుమ పిండి‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన, ఇది షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

అయితే, చపాతీ పిండిలో కాస్త మెంతి పిండిని కూడా యాడ్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెంతులు షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. మెంతులలో ఉన్న ఫైబర్, మెగ్నీషియం అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. దీంతో పాటుగా ఫ్లాక్స్ సీడ్స్‌ పొడి కొద్దిగా చపాతి పిండిలో కలుపుకోవాలి. దీన్ని కలపడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు.. ఫైబర్ లభిస్తాయి. ఇవి షుగర్ నియంత్రణలో సహాయపరుతాయి.

ఇవి కూడా చదవండి

అలాగే, ఆకుకూరలు కూడా చపాతీ పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఆకుకూరల్లో ఉండే ఐరన్, విటమిన్స్.. మినరల్స్ చపాతీని పోషకాహారంగా మార్చుతాయి. ఇవి రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్‌ చేసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది.. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఇలా చెప్పిన పదార్థాలు అన్నీ కలిపి చపాతీ పిండి తయారు చేసుకుని.. దాంతో చపాతీ చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ చపాతీ పిండిలో కలపడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..