AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వీట్ కార్న్ లేదా దేశీ కార్న్.. వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా

వర్షం పడుతుంటే.. ఆ వర్షం చినుకులను చూస్తూ.. వేడి మొక్కజొన్న పొత్తుని తింటూ ఉంటే.. కలిగే ఆనందం వెలకట్ట లేనిది. మొక్క జొన్న పొత్తు రుతుపవనాన్ని ప్రత్యేకం అనిపించేలా చేస్తుంది. అది దేశీ మొక్క జొన్న పొత్తు అయినా లేదా విదేశీ మొక్క జొన్న పొత్తు అయినా. ఈ మొక్కజొన్న పొత్తు రుచిని అన్ని వయసులకు చెందిన వారు ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో దేశీ కార్న్ లేదా స్వీట్ కార్న్ ఏది ఆరోగ్యానికి అధికంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం..

స్వీట్ కార్న్ లేదా దేశీ కార్న్.. వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా
Sweet Corn Vs Desi Corn
Surya Kala
|

Updated on: Jul 21, 2025 | 9:30 PM

Share

తేలికపాటి వర్షపు చినుకులు, చల్లని గాలి.. ఆహ్లదకరమైన వాతావరణంలో చేతిలో వేడి మొక్కజొన్న పొత్తు ఉంటే ఆహా అనిపిస్తుంది ఎవరికైనా.. వర్షాకాలం లో అడుగు పెట్టగానే నగర వీధుల్లో మొక్కజొన్నపొత్తు తీపి వాసన వ్యాపిస్తుంది. కొన్ని చోట్ల దేశీ మొక్కజొన్నను నిప్పుల మీద కాలుస్తుంటే.. మరికొన్న చోట్ల స్వీట్ కార్న్ ను ఉడికించి వెన్న, సుగంధ ద్రవ్యాలను కలిపి కప్పుల్లో అందించడానికి రెడీ అవుతారు. అందుకనే ఈ సీజన్‌లో తినే మొక్కజొన్న రుచి నాలుకపైనే కాదు, జ్ఞాపకాల్లో కూడా నిలిచిపోతుంది.

దేశీ కార్న్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతంలలో రోడ్డు పక్కన దేశీ మొక్కజొన్న అమ్మే దుకాణాలు కనిపిస్తూనే ఉంటాయి. అదే సాయంలో తోపుడు బండిపై నిప్పుల కుంపటి మీద బొగ్గులపై కాల్చిన మొక్కజొన్నకు.. నిమ్మకాయ, ఉప్పు, ప్రత్యేక చాట్ మసాలాను అద్ది అందిస్తారు. ఈ మొక్కజొన్న తీపిగా ఉంటుంది. ఇది వర్షాకాలంలో భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. దేశీ మొక్కజొన్న చౌకగా, రుచికరంగా ఉంటుంది. అన్ని వయసుల వారు ఇష్టపడే సాంప్రదాయ ఆహారంలో భాగం.

స్వీట్ కార్న్

ఇవి కూడా చదవండి

మరోవైపు అమెరికన్ స్వీట్ కార్న్ యువత, పిల్లలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఉడికించిన స్వీట్ కార్న్‌ను వెన్న, చీజ్, నిమ్మ రసం, సుగంధ ద్రవ్యాలతో కలిపి చిన్న కప్పుల్లో అందిస్తారు. ఇది తినడానికి చాలా మెత్తగా అంటే మృదువుగా ఉంటుంది. త్వరగా తినవచ్చు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, ఉద్యోగ మహిళలు ఈ ఆరోగ్యకరమైన చిరుతిండిని ఇష్టపడుతున్నారు.

మొక్కజొన్న కేవలం రుచికే పరిమితం కాదు. మొక్కజొన్నలో ఫైబర్, ఐరన్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ రెండు రకాల మొక్క జొన్నలు భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.. దేశీ మొక్కజొన్నలో కొవ్వు తక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మరోవైపు, స్వీట్ కార్న్ శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు..బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ధర, డిమాండ్ దేశీ మొక్కజొన్న 20 నుంచి 30 రూపాయలకు లభిస్తుండగా, స్వీట్ కార్న్ 40 నుండి 60 రూపాయలకు అమ్ముడవుతోంది. వర్షాకాలంలో వీటి డిమాండ్ చాలా పెరుగుతుంది. దుకాణదారులు ప్రతిరోజూ తాజా మొక్కజొన్నను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. రెండు రకాల మొక్కజొన్నలు రుతుపవనాల సమయంలో తినే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)