Deep Sleep for Health: కలలు కనేంత గాఢ నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.. ఎలానో తెలుసుకోండి!

ఆధునిక జీవనశైలిలో మనం నిద్రకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఖాళీ దొరికిన కాసేపూ విశ్రాంతి తీసుకోవడం కంటే.. వివిధ మాధ్యమాల్లో వినోదం కోసం వెదుకుతూ గడిపేస్తున్నాం.

Deep Sleep for Health: కలలు కనేంత గాఢ నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.. ఎలానో తెలుసుకోండి!
Deep Sleep
Follow us

|

Updated on: Aug 09, 2021 | 4:48 PM

Deep Sleep for Health: ఆధునిక జీవనశైలిలో మనం నిద్రకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఖాళీ దొరికిన కాసేపూ విశ్రాంతి తీసుకోవడం కంటే.. వివిధ మాధ్యమాల్లో వినోదం కోసం వెదుకుతూ గడిపేస్తున్నాం. ఒకవేళ నిద్రపోయినా.. అది సగం సగం నిద్రలానే మారిపోతోంది. నాలుగు గంటలు నిద్రపోయాం కదా.. ఆరు గంటలు నిద్రపోయాం కదా అని గంటలు లెక్కపెడ్తున్నాం. అయితే..ఎన్నిగంటలు నిద్రపోయాం అనేదానికన్నా ఎంత మంచి నిద్రపోయాం అనేది మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుందని నిపుణులు అంటున్నారు. అదేమిటి నిద్రలో మంచీ చెడూ ఉంటాయా అని మీరనవచ్చు. ఉంటాయి.. అదేమిటో వివరంగా తెలుసుకుందాం..

మనకు పూర్తి నిద్ర చాలా ముఖ్యం. ముఖ్యంగా గాఢ నిద్ర..దీనినే మంచి నిద్ర అని చెప్పింది.  ఇది మన శరీరాన్ని రిపేర్ చేసే శక్తిని ఇస్తుంది. తగినంత నిద్ర స్థూలకాయం, గుండె జబ్బులు వంటి వ్యాధులను నివారించడమే కాకుండా అనారోగ్యంతో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

నిద్రలో నాలుగు దశలు ఉంటాయి. అత్యంత ముఖ్యమైన దశ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM). మనం కలలు కనే దశ ఇది. ఈ దశ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఎనిమిది గంటలు నిద్రపోతున్నట్లయితే, అప్పుడు 20 శాతం అంటే 96 నిమిషాల గాఢ నిద్ర అంటే REM చాలా ముఖ్యం.

గాఢ నిద్ర కావాలంటే ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి..

1. స్లీప్ ఫౌండేషన్ చెబుతున్నదాని ప్రకారం స్క్రీన్ సమయాన్ని నియంత్రించండి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వల్ప-తరంగదైర్ఘ్య కాంతిని విడుదల చేస్తాయి. ఈ నీలి కాంతి సాయంత్రం నిద్ర మెలటోనిన్ నిద్రను తగ్గిస్తుంది. ఇది నెమ్మదిగా తరంగాలు, REM సమయాన్ని కూడా తగ్గిస్తుంది.

2. 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ఆచరించడం..ఈ టెక్నిక్ కోసం, సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకోండి. నాలుకను అంగిలికి తాకించండి. పెదవులు తెరిచి, ఈలలు వేయడం వంటి శబ్దం చేయండి. నోటి నుండి శ్వాసను పూర్తిగా వదలండి. ఇప్పుడు పెదాలను మూసివేయండి. మనసులో నెమ్మదిగా నాలుగు అంకెలు లెక్కిస్తూ  ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఏడు సెకన్ల పాటు శ్వాసను బిగబెట్టండి. ఎనిమిది సెకన్ల పాటు, నోటి ద్వారా ఊపిరి పీల్చుకోండి తరువాత మొదట చేసిన పెదవులు తెరిచి ఈలవేయడం వంటి శబ్దం మళ్ళీ చేయండి.

నిద్ర 4 దశలు..

మొదటి దశ: వేగవంతమైన కంటి కదలిక అనగా NREM దశ 1- మీరు నిద్రపోగానే ఈ దశ ప్రారంభమవుతుంది. ఈ దశ సుమారు 20 నిమిషాలు ఉంటుంది.

రెండవ దశ: NREM స్టేజ్ 2 – ఈ నిద్ర వ్యవధి మొత్తం రాత్రి నిద్రలో 50% ఉంటుంది. ఈ స్థితిలో, మెదడు నెమ్మదిగా తరంగాలు లేదా డెల్టా తరంగాలను విడుదల చేయడం ప్రారంభిస్తుంది.

మూడవ దశ: NREM స్టేజ్ 3 – నిద్ర యొక్క ఈ దశను ‘గాఢ నిద్ర’ అంటారు. శరీరం పునరుద్ధరణ అలాగే, అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైన దశ.

నాల్గవ దశ: వేగవంతమైన కంటి కదలిక ( REM)- ఈ నిద్ర స్థితిలో, దాదాపు అన్ని కండరాలు సడలుతాయి. శ్వాస సక్రమంగా ఉండదు. కలలు రావడం మొదలవుతాయి. ఇది మన నిద్ర చివరి అదేవిధంగా అతి ముఖ్యమైన సైకిల్.

నాలుగోదశ నిద్ర ఎంత ఎక్కువ ఉంటె అంత ఆరోగ్యం ఉంటుందని నిపుణులు చెబుతారు. కనీసం మనం నిద్రించిన మొత్తం సమయంలో ఈ దశ 20 శాతం ఉండాలని వారు సూచిస్తున్నారు.

Also Read: ORS Drink: మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఓఆర్ఎస్ డ్రింకులు మంచివేనా? నిపుణులు ఏమంటున్నారు?

Beauty Tips : కుంకుమడి తైలంతో అందానికి సొబగులు..! ఈ 4 సమస్యలకు చక్కటి పరిష్కారం..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం