AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO: భారీగా తగ్గుతోన్న కండోమ్‌ వినియోగం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

టీనేజర్లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రల వాడకం తగ్గుతోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఐరోపా దేశాల్లో, దాదాపు మూడింట ఒకవంతు మంది అబ్బాయిలు, బాలికలు శారీరకంగా కలిసిన సమయంలో కండోమ్‌లు లేదా గర్భనిరోధక మాత్రలు తీసుకోలేదని అంగీకరించినట్లు ఈ నివేదిక పేర్కొంది...

WHO: భారీగా తగ్గుతోన్న కండోమ్‌ వినియోగం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Who
Narender Vaitla
|

Updated on: Aug 31, 2024 | 9:33 AM

Share

ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు సురక్షితమైన శృంగారంపై చాలా మందిలో అవగాహన పెరిగింది. కండోమ్‌ వినియోగం భారీగా పెరగడంతో హెచ్‌ఐవీ వంటి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వాలు ప్రచారం కల్పించడం, ఉచితంగా కండోమ్‌లను అందజేయడం వంటి చర్యలు వీటి వినియోగం పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. అయితే తాజాగా కొన్ని దేశాల్లో కండోమ్ వినియోగం భారీగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబతోంది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టీనేజర్లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రల వాడకం తగ్గుతోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఐరోపా దేశాల్లో, దాదాపు మూడింట ఒకవంతు మంది అబ్బాయిలు, బాలికలు శారీరకంగా కలిసిన సమయంలో కండోమ్‌లు లేదా గర్భనిరోధక మాత్రలు తీసుకోలేదని అంగీకరించినట్లు ఈ నివేదిక పేర్కొంది. 2018 నుంచి ఈ అలవాటులో ఎలాంటి మార్పు లేదు. దీని కారణంగా సుఖ వ్యాధులతో పాటు, అవాంఛిత గర్భధారణలు పెరిగినట్లు నివేదిలో వెల్లడైంది.

సర్వేలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల యూరప్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని 42 దేశాలలో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 15 సంవత్సరాల వయస్సు గల 2,42,000 మంది టీనేజర్లు పాల్గొన్నారు. 2014లో కండోమ్‌ ఉపయోగించిన వారి సంఖ్య 70 శాతం ఉండగా, తాజా నివేదికలో తేలిన అంశం ప్రకారం ఆ సంఖ్య 61 శాతానికి తగ్గింది. ఇక మహిళల విషయానికొస్తే కండోమ్‌ లేదా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించిన వారి సంఖ్య 63 శాతం నుంచి 57 శాతానికి తగ్గింది. అంటే, టీనేజర్లలో మూడింట ఒకవంతు మంది శారీరక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు కండోమ్‌లను ఉపయోగించడం లేదని అర్థం.

నివేదికలో తేలిన అంశాల ప్రకారం దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన 33 శాతం మంది యువకులు కండోమ్‌లు లేదా గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం లేదని తేలింది. అయితే ఉన్నత తరగతి కుటుంబాలకు చెందిన యువకుల సంఖ్య 25%గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్‌ డైరెక్టర్‌ హన్స్ క్లూగే ఈ విషయమై మాట్లాడుతూ.. ఐరోపాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అన్నారు. అసురక్షిత శృంగారం వల్ల కలిగే నష్టాలను యువతకు సరైన సమయంలో చెప్పకపోవడం వల్ల కూడా ఈ తరహా సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..