Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Coffee vs Hot Coffee: వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలాంటి సమయంలో తాగాలో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా కాఫీని ఇష్టపడే వారు సంఖ్య కొట్లలో ఉంటుంది. చాలా మందికి ఇష్టమైన పానీయం అంటే కాఫీ అని చెబుతారు. రుచికరమైన ప్రత్యేకమైన ఫ్లేవర్ తో ఉండే కాఫీని కొంతమంది వేడిగా తాగాలని కోరుకుంటారు. మరి కొందరు చల్లగా కోల్డ్ కాఫీని తీసుకుంటారు. కాఫీని చాలా తక్కువ నురుగుతో లేదా చాలా ఎక్కువ నురుగుతో ఇలా రెండు విధాలుగా ఆనందించవచ్చు. అయితే ఈ రోజు వేడి కాఫీ, కోల్డ్ కాఫీలలో ఏది మంచిది తెలుసుకుందాం..

Cold Coffee vs Hot Coffee: వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?  ఎలాంటి సమయంలో తాగాలో తెలుసా..
Cold Coffee Vs Hot Coffee
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2025 | 10:04 AM

ప్రపంచంలో అత్యంత ప్రియమైన పానీయాలలో కాఫీ ఒకటి. కొంతమంది ఒక కప్పు వేడి కాఫీని తాగి తమ రోజుని ప్రారంభిస్తారు. మరికొందరు చల్లని, రిఫ్రెషింగ్ కోల్డ్ కాఫీని ఇష్టపడతారు. అయితే వేడి కాఫీ, చల్లని కాఫీలలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం అనే ప్రశ్న తలెత్తుతుంది? రెండింటిలో పోషక విలువలు, ప్రభావాలు ఒకేలా ఉంటాయా లేదా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకుందాం..

కాఫీలో కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు, అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతం చేయడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే కాఫీ ప్రభావం మీరు దానిని తాగే విధానం బట్టి ఉంటుంది. అంటే వేడిగా లేదా చల్లగా కాఫీ తాగడం పై ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రోజు ఈ రెండు కాఫీలలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం..

వేడి కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు

వేడి కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో వేడివేడిగా కాఫీ తాగడం మంచిది. ఎందుకంటే దీని వినియోగం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే వేడి కాఫీలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. వేడి కాఫీలో ఉండే కెఫిన్ మెదడుకు కూడా మంచిది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిలో మార్పులను నివారిస్తుంది. దీనితో పాటు జీవక్రియను వేగవంతం చేస్తుంది, జీర్ణక్రియను, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

కోల్డ్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు

అదే సమయంలో మనం కోల్డ్ కాఫీ ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకోవాలనుకుంటే వేసవిలో ప్రజలు దీన్ని తాగడానికి చాలా ఇష్టపడతారు. వేసవిలో కోల్డ్ కాఫీని తాగడం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కోల్డ్ కాఫీలో కూడా వేడి కాఫీలో ఉన్నంత కెఫిన్ ఉంటుంది. ఈ విధంగా ఇది వేసవిలో మీకు తాజాదనాన్ని ఇస్తుంది. ఇది ఆమ్లతను తగ్గించడంలో, ఆర్ద్రీకరణను నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఏ కాఫీ ఎక్కువ ప్రయోజనకరం అంటే

ఈ రెండు కాఫీలు వాటి సొంత విభిన్న ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఐతే ఇవి అందించే ప్రయోజనాలు మీ ఆరోగ్యం, అవసరాలపై ఆధారపడి ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణ పెరగలనుకుంటే అప్పుడు వేడి వేడి కాఫీ తాగాలి. మరోవైపు బరువు తగ్గాలనుకున్నా.. వేసవిలో తాజాగా ఉండాలనుకున్నా కోల్డ్ కాఫీ మంచి ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)