ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాసిన్ని కొత్తిమీర ఆకులు తిన్నారంటే..
17 March 2025
TV9 Telugu
TV9 Telugu
కొత్తిమీరను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. ఆ పరిమళం అలాంటిది. కూర, చారు, పచ్చడి.. ఎందులో వేసినా.. దాని రుచి రెట్టింపైపోతుంది. ఇది రుచికే కాదండోయ్, ఆరోగ్యానికీ మంచిదే
TV9 Telugu
కొత్తిమీర ఆకులు ఔషధ గుణాల నిధి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, సోడియం, ఫోలేట్, విటమిన్ సి, బి6, ఫైబర్, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
కొత్తిమీర మంచి పోషకాహారం. విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం విస్తారంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది
TV9 Telugu
కడుపుబ్బరం, మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. ఇందులోని ఎ-విటమిన్ కళ్లకు మేలుచేస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇ-విటమిన్ కంటి కింది నల్లటి వలయాలను పోగొడుతుంది
TV9 Telugu
కొత్తిమీర ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది
TV9 Telugu
దీనిలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులు తినడం వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి
TV9 Telugu
రోజూ కాస్త కొత్తిమీర తినడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుంది. పచ్చి కొత్తిమీర ఆకులు డయాబెటిస్ లో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తులు కొత్తిమీరను వారి ఆహారంలో తప్పక చేర్చుకోవాలి
TV9 Telugu
దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఓస్టియోపొరాసిస్ లాంటి సమస్యలు తలెత్తవు. ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్లజబ్బులు తగ్గుతాయి