AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. లవంగంతో ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుందట.. ట్రై చేయండి..

ఊబకాయం అనేది శరీరంలోని వివిధ ప్రదేశాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడంతో సంభవించే తీవ్రమైన పరిస్థితి. వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. స్థూలకాయం జన్యుపరమైన వైద్య పరిస్థితుల ఫలితంగా వచ్చేది మాత్రమే కాదు, చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా వచ్చేది..

గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. లవంగంతో ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుందట.. ట్రై చేయండి..
Clove For Weight Loss
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2024 | 8:51 PM

Share

ఊబకాయం అనేది శరీరంలోని వివిధ ప్రదేశాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడంతో సంభవించే తీవ్రమైన పరిస్థితి. వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. స్థూలకాయం జన్యుపరమైన వైద్య పరిస్థితుల ఫలితంగా వచ్చేది మాత్రమే కాదు, చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా వచ్చేది.. అటువంటి పరిస్థితిలో, దానిని వదిలించుకోవడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. భారతీయ వంటగదిలో ఉన్న అనేక సుగంధ ద్రవ్యాలు రుచితో పాటు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. లవంగం స్థూలకాయాన్ని తగ్గించే ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉన్న మసాలా దినుసు.. NCBIలో ప్రచురించిన ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. లవంగాల సారం తీసుకోవడం బరువు నియంత్రణలో, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి, వ్యాయామం మాత్రమే కాదు, భారతీయ వంటగదిలో ఉండే మసాలా దినుసు లవంగం వినియోగం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.. లవంగం యాంటీ ఒబేసిటీలో సమృద్ధిగా ఉండే మసాలాలలో ఒకటి… అందుకే ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆహారంలో లవంగం చేర్చుకోవడానికి సమర్థవంతమైన మార్గాలను తెలుసుకోండి..

లవంగం నీరు త్రాగాలి..

లవంగం నీరు మీ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని సిద్ధం చేయడానికి, కొన్ని లవంగాలను ఒక జగ్ నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచండి. తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.. ఇలా చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయి.. బరువు తగ్గడం కూడా ప్రారంభమవుతుంది.

లవంగం టీ..

లవంగాలను వేడి నీటిలో 5-10 నిమిషాలు ఉడకబెట్టడం ద్వారా లవంగం టీని సిద్ధం చేసుకోవచ్చు.. మీరు ఈ టీని రోజుకు ఒకసారి తాగవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆకలిని అణిచివేస్తుంది.. ఇంకా జీవక్రియను పెంచుతుంది.

ఆహారంలో..

ఇంట్లో తయారుచేసిన మసాలా మిశ్రమాలకు లవంగాలను జోడించండి.. మీ ఆహారంలో ఈ మసాలాను యాడ్ చేయండి.. లవంగాలు సూప్‌లు, కూరలు, స్టైర్-ఫ్రైస్ వంటి వంటకాలకు వెచ్చని రుచిని జోడించి.. ఆస్వాదించండి..

స్మూతీకి లవంగాలు జోడించండి

మీకు ఇష్టమైన స్మూతీ రెసిపీకి చిటికెడు లవంగం పొడిని జోడించండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుకునేందుకు, అతిగా తినడాన్ని నివారించవచ్చు. ఇంకా స్మూతీకి భిన్నమైన రుచిని పొందవచ్చు..

లవంగాలను వంట నూనెలో వేయండి..

తక్కువ వేడి మీద ఆలివ్ నూనె లేదా నూనెలో లవంగాలను జోడించండి.. ఇలా చేయడం ద్వారా వంట నూనె రుచిని మెరుగుపరచవచ్చు.. ఈ సుగంధ నూనెను వంట చేయడానికి ఉపయోగించవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..