AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో గడియారం ఏ వైపున పెడితే టైమ్‌ కలిసి వస్తుందో తెలుసా..? ఇలా చేస్తే డబ్బే డబ్బు..

ప్రతి ఇంట్లో గడియారాలు తప్పనిసరిగా ఉంటాయి. గడియారాలు సమయాన్ని చెప్పడమే కాకుండా, ఇంటి సంతోషాలు, దుఃఖాలు, శుభ, అశుభ సమయాలతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. మీరు గడియారాన్ని కేవలం సమయం చెప్పే వస్తువుగా భావించి ఎక్కడైనా వేలాడదీస్తే, అది మీకు అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, గడియారాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్లో అమర్చుకునేటప్పుడు, వాస్తు శాస్త్రం సూచించిన ఈ నియమాలను తప్పక గుర్తుంచుకోండి.

ఇంట్లో గడియారం ఏ వైపున పెడితే టైమ్‌ కలిసి వస్తుందో తెలుసా..? ఇలా చేస్తే డబ్బే డబ్బు..
Wall Clock
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2025 | 9:47 PM

Share

గడియారాన్ని సరైన దిశలో ఉంచడం ప్రతి ఒక్కరి ఇంటికి అత్యంత ముఖ్యం. లేకుంటే అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, గడియారాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే గడియారం దిశ మన పనిలో మనం పొందే ఫలితాలను నిర్ణయిస్తుంది. వాస్తు ప్రకారం, గడియారాన్ని తప్పు దిశలో ఉంచినట్లయితే, ఆ ఇంట్లో సమస్యలు చుట్టుముడతాయని సూచిస్తున్నారు. ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

వాస్తు ప్రకారం, గడియారాన్ని ఇల్లు లేదా ఆఫీసులలో ఉంచుకోవటానికి సరైన దిశ తూర్పు, పడమర లేదా ఉత్తర వైపు అంటున్నారు వాస్తు నిపుణులు. గడియారాన్ని ఇంట్లో ఈశాన్యంలో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశ సంపదను సూచిస్తుంది. వాస్తు ప్రకారం, గడియారాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే, అది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. వ్యతిరేక దిశలో ఉంచినట్లయితే, ప్రతికూలత పెరుగుతుంది.

అయితే వాస్తు ప్రకారం దక్షిణం వైపు ఉన్న ఇంట్లో గడియారాలు, అద్దాలు పెట్టకూడదని చెబుతున్నారు. ఈ దిశ యమ దిశను సూచిస్తుంది. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లోని గడియారాలను ముఖద్వారానికి పెట్టకూడదని చెబుతున్నారు. దీని వల్ల ఆ ఇంట్లో టెన్షన్లు పెరుగుతాయిన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

తూర్పు, పడమర లేదా ఉత్తర దిశలు ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తాయి. అంతేకాకుండా, మనం తలపెట్టిన పనులన్నీ అంతరాయం లేకుండా సజావుగా సాగుతాయని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయంలో దక్షిణం వైపు గోడకు గడియారం ఉంచకూడదని చెబుతున్నారు. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం పైన కూడా గడియారాన్ని పెట్టకూడదని అంటున్నారు. అంతేకాదు.. ఇంట్లో గోడ గడియారం పాడవకుండా జాగ్రత్త వహించండి. వాస్తుప్రకారం ఇంట్లో పెట్టుకునే ఏ వస్తువులు పగిలిపోకుండా చూసుకోవాలి. ఇవి ఇంట్లో నెగిటివిటీని పెంచుతాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా