AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Male Fertility: తండ్రి అవ్వాలనే కలను లాగేసుకునే అలవాట్లు ఇవే.. తక్షమే గుడ్ బై చెప్పండి..

నేటి మానవ జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తినే ఆహారం దగ్గర నుంచి నిద్రపోయే సమయంలో వరకూ అన్నీ మార్పులే. బిజీబిజీ జీవితంలో కాలంతో పోటీపడుతూ పరుగులేత్తుతున్నారు. దీంతో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా పురుషులు కొన్ని రకాల అలవాట్ల వలన తక్కువ స్పెర్మ్ కౌంట్‌తో సహా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. పురుషులు తక్షణమే పక్కకు పెట్టాల్సిన అలవాట్లు ఏమిటంటే..

Male Fertility: తండ్రి అవ్వాలనే కలను లాగేసుకునే అలవాట్లు ఇవే.. తక్షమే గుడ్ బై చెప్పండి..
Bad Habits
Surya Kala
|

Updated on: Jun 30, 2025 | 11:38 AM

Share

నేటి బిజీ జీవితంలో, చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఊబకాయం, బిపి, డయాబెటిస్, తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు ప్రజలలో పెరుగుతున్నాయి. పురుషులలో మాత్రమే కనిపించే మరో సమస్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. మద్యం, సిగరెట్లు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా పురుషుల సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీని వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ నిరంతరం తగ్గుతోంది. దీంతో పురుషులు తండ్రి అయ్యే ఆనందాన్ని పొందలేకపోతున్నారు. వాస్తవానికి చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే దీనికి కారణాలు కావు. పురుషుల కొన్ని అలవాట్లు కూడా వారి స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా.. ఈ రోజు పురుషుల వీర్యకణాల సంఖ్యను తగ్గించే కొన్ని చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం.. ఈ అలవాట్లున్న పురుషులు వెంటనే వాటికీ స్వస్తి చెప్పి అరొగ్యకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుందాం..

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం.

ఎవరైనా ల్యాప్‌టాప్‌ను తమ ఒడిలో ఉంచుకుని పని చేస్తుంటే.. వీలైనంత త్వరగా ఈ అలవాటును మార్చుకోండి. వాస్తవానికి, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి గాలి స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై మాత్రమే ఉంచి పని చేయడానికి ప్రయత్నించండి. వృషణాల ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ఈ సమస్య రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం

చాలా మంది పురుషులు బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. నిజానికి ఈ అలవాటు కూడా తక్కువ స్పెర్మ్ కౌంట్ కు ఒక పెద్ద కారణంగా పరిగణించబడుతుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీని కారణంగా స్పెర్మ్ ఉత్పత్తి అవ్వదు. వదులుగా ఉండే లోదుస్తులను మాత్రమే ధరించడానికి ప్రయత్నించండి.

ధూమపానం, మద్యపానం

ధూమపానం లేదా మద్యపానం చేసే అలవాటు ఉన్న పురుషులలో కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఈ అలవాట్లు స్పెర్మ్ ఆరోగ్యానికి మంచిది కాదు. స్పెర్మ్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. దీనితో పాటు మద్యపానం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది అంగస్తంభన పనిచేయకపోవడానికి కారణమవుతుంది.స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఒత్తిడిని తీసుకోవడం

పురుషులు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే.. వారి శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించడమే కాదు దాని నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది.

ఫోన్ జేబులో పెట్టుకునే అలవాటు

చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లను ప్యాంట్ జేబుల్లో ఉంచుకుంటారు. అలాంటప్పుడు ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. కనుక వీలైంత వరకూ సెల్ ఫోన్ ని ఫ్యాంట్ జేబు నుంచి తీసి ఫోన్‌ను బ్యాగ్‌లో ఉంచుకోవడం అలవాటు చేసుకోండి.

ఏ అలవాట్లు మంచివంటే..

స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండటానికి రాత్రి సముయంలో మంచి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి. ఒత్తిడికి గురికావద్దు. రోజూ ధ్యానం చేయడం కూడా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఎత్తుకు తగిన బరువును నిర్వహించండి .

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)