AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Gardening Tips: గార్డెనింగ్ అంటే ఇష్టమా.. వర్షాకాలంలో మొక్కలను బూజు తెగుల నుంచి ఎలా రక్షించుకోవాలంటే..

మొక్కలను పెంచడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. అయితే మొక్కలు పచ్చగా ఉండాలన్నా, వేగంగా ఎదగాలన్నా సీజన్ కి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో అడుగు పెట్టాం.. అయితే ఈ సీజన్ లో కూడా మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే మొక్కల మొదల ఎక్కువ మొత్తంలో నీరు చేరితే మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వర్షాకాలంలో మొక్కలు బలంగా ఎదగాలంటే.. కొన్ని చర్యలను అనుసరించాల్సి ఉంటుంది. తద్వారా మొక్కలను ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవచ్చు.

Monsoon Gardening Tips: గార్డెనింగ్ అంటే ఇష్టమా.. వర్షాకాలంలో మొక్కలను బూజు తెగుల నుంచి ఎలా రక్షించుకోవాలంటే..
Monsoon Gardening Tips
Surya Kala
|

Updated on: Jun 30, 2025 | 10:30 AM

Share

వర్షాకాలం మొక్కలకు చాలా మంచిది. ఈ కాలంలో మొక్కలు పచ్చగా ఉండటంతో పాటు వేగంగా పెరుగుతాయి. అదే సమయంలో కొన్నిసార్లు ఈ కాలంలో మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. అధిక తేమ. ఎప్పుడూ నేల తడిగా ఉండడం వలన కొన్ని సార్లు మొక్కల వేర్లు కుళ్ళిపోవడం మొదలవుతాయి. అంతేకాదు ఆకులపై బూజు కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మొక్కలను పెంచుకోవచ్చు.

బూజు తెగులు నుంచి మొక్కలను ఎలా రక్షించాలంటే వర్షాకాలంలో మొక్కలకు చేరుకునే ఎక్కువ నీరు వలన ఆకులపై బూజు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల మొక్కలు పాడైపోతాయి. అటువంటి పరిస్థితిలో మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయవచ్చు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. వాస్తవానికి వేప నూనె మొక్కల ఆకులపై సహజ శిలీంద్ర సంహారిణిగా పనిచేస్తుంది. ఆకులను బూజు నుంచి రక్షిస్తుంది.

నీటి నిర్వహణలో జాగ్రత్త వర్షాకాలంలో కుండీలలో ఎక్కువ మొత్తంలో నీటిని నింపడం మొక్కలకు హానికరం. నీరు నిలిచిపోవడం వల్ల వేర్లు కుళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో కుండీల నుంచి నీరు బయటకు వెళ్ళే మార్గాలను సరిగ్గా నిర్వహించండి. అవసరమైతే అదనపు నీటిని తొలగించండి. తద్వారా మొక్కల ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది. కుండీలకు రంధ్రాలు కూడా చేయవచ్చు. ఇలా చేయడం వలన కుండీలలో నీరు నిలిచిపోకుండా నిరోధించవచ్చు.

ఇవి కూడా చదవండి

అధిక ఎరువులు హానికరం కావచ్చు వర్షాకాలంలో ప్రజలు మొక్కలకు ఎక్కువ ఎరువులు వేస్తారు. ఇది మొక్కకు కూడా హాని కలిగించవచ్చు. ఈ సీజన్‌లో పరిమిత మొత్తంలో కంపోస్ట్ లేదా వర్మీకంపోస్ట్ వాడండి.

మొక్కల సంరక్షణ ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మొక్కల ఆకులను, కాండాలను తనిఖీ చేయండి. ఏదైనా ఆకుపై బూజు కనిపిస్తే.. దానిని వెంటనే తొలగించండి. ఇలా చేయడం వలన మొక్కలకు వ్యాధి సంక్రమణ అవకుండా నిరోధిస్తుంది.

మొక్కలను ఎండలో ఉంచండి. వర్షాకాలంలో మొక్కలను పరిమిత సమయం పాటు ఎండలో ఉంచండి. మీరు కుండీల్లో మొక్కలు పెంచుతుంటే.. ఆ కుండీలను ఎండలో ఉంచవచ్చు. ఇలా చేయడం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)