AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: కూతురు భవిష్యత్ బాగుండాలంటే.. తండ్రి తన కూతురి విషయంలో ఈ 5 తప్పులు చేయవద్దన్న చాణక్య

తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తండ్రికి తన కూతురు మరో అమ్మ అయితే.. ఆ కూతురికి తండ్రి ఒక హీరో.. తన కూతురికి ఏ చిన్న సమస్య ఎదురైనా రక్షించడానికి తండ్రి సిద్ధంగా ఉంటాడు. తండ్రి తన కూతురిని అపరిమితంగా ప్రేమిస్తాడు. అయితే తండ్రి అయినా తన కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కూతురు విషయంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఎందుకంటే ఇవి తండ్రి కూతురు మధ్య సంబంధాన్ని దెబ్బతీయడమే కాదు.. కూతురి భవిష్యత్తుపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.

Chanakya Niti: కూతురు భవిష్యత్ బాగుండాలంటే.. తండ్రి తన కూతురి విషయంలో ఈ 5 తప్పులు చేయవద్దన్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Jun 30, 2025 | 8:38 AM

Share

ఆచార్య చాణక్య గొప్ప విధాన పండితుడు మాత్రమే కాదు.. జీవితంలోని ప్రతి అంశాన్ని కూడా లోతుగా ఆలోచించాడు. అందుకనే ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజల జీవితాల జీవితానికి మార్గదర్శక పాత్రను పోషిస్తుంది. కుటుంబ సంబంధాల గురించి, ముఖ్యంగా తండ్రి, కుమార్తె మధ్య సంబంధం గురించి చాణక్య తన నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన విషయాలను చెప్పాడు. తండ్రి , కుమార్తె మధ్య సంబంధం చాలా పవిత్రమైనది. బలమైనదని చాణక్య నమ్మాడు. అయితే ఈ సంబంధం జీవితాంతం మధురంగా ఉండాలంటే.. కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలని.. లేకపోతే సంబంధంలో దూరం ఏర్పడవచ్చని చెప్పాడు. ఈ నేపధ్యంలో చాణక్య నీతి ప్రకారం తండ్రి తన కుమార్తెతో విషయంలో ఏ పనులు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

కూతురు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు

ప్రతి వ్యక్తికి తన జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. అదేవిధంగా ఒక కుమార్తె కూడా తన జీవితం గురించి తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. తండ్రి ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే.. కుమార్తె ఆత్మవిశ్వాసం బలహీనపడవచ్చు. అది కెరీర్ గురించి అయినా, వివాహం గురించి అయినా, కుమార్తె అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇవ్వడం ముఖ్యం. ఆచార్య చాణక్యుడి ప్రకారం తెలివైన తండ్రి అంటే తన కుమార్తెకు ఏది సరైనది? ఏది తప్పు అనేది తెలియజేశాలి అంటే తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని వివరించి.. కుమార్తెకు సొంతంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛను తండ్రిని ఇవ్వాలని సూచించాడు.

కొడుకు, కూతురు మధ్య వివక్ష చూపొద్దు

చాణక్య నీతిలో కొడుకు, కూతురు మధ్య ఎలాంటి వివక్షత ఉన్నా అది తప్పు అని స్పష్టంగా చెప్పబడింది. ఒక తండ్రి తన కూతురిని విస్మరిస్తూ కొడుకుకు ఎక్కువ హక్కులు, ప్రేమ ఇస్తే, అది కూతురి మనసులో న్యూనతా భావాన్ని కలిగిస్తుంది. కనుక తండ్రి తన పిల్లలందరినీ సమానంగా చూస్తూ.. సమానమైన ప్రేమ, గౌరవం, అవకాశాలు ఇవ్వాలి. అప్పుడు కూతురు కొడుకులాగే సమర్థురాలిగా ఎదుగుతుంది.

ఇవి కూడా చదవండి

కుమార్తె భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఆచర్య చాణక్యుడి ప్రకారం కుటుంబ భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత, తండ్రికి ఉన్న అతిపెద్ద విధి. కూతురికి ఇంట్లో లేదా బయట సురక్షితమైన వాతావరణం ఉండాలి. తండ్రి కూతురికి ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించాలి, ఆమె దినచర్య, స్నేహితుల గురించి సమాచారాన్ని తండ్రి తన వద్ద ఉంచుకోవాలి. ఆమె సురక్షితంగా ఉంచుతూ.. స్వతంత్రంగా ఎదిగే వాతావరణాన్ని అందించాలి.

కుమార్తె చదువు విషయంలో నిర్లక్ష్యం వద్దు

చాణక్య నీతిలో విద్యను జీవితానికి ఆధారం అని భావించాడు. చదువుకున్న కుమార్తె మొత్తం కుటుంబానికి, సమాజానికి సరైన దిశానిర్దేశం చేయగలదని ఆయన విశ్వాసం. కనుక తండ్రి తన కొడుకు చదువు విషయంలో ఎంత శ్రద్ధ చూపుతాడో.. అదే విధంగా కూతురి చదువు పట్ల కూడా అంతే శ్రద్ధ చూపాలి. కూతురి ఆసక్తులను అర్థం చేసుకుని ఆమెకు పురోగతి సాధించడానికి అవకాశాలను తండ్రి కల్పించాలి. కుమార్తె అభివృద్ధి చెందే ప్రతి వేదికను కుమార్తెకు పరిచయం చేయాలి.

కుమార్తెకు భావోద్వేగ మద్దతు

ఒక కూతురికి ఆర్థిక లేదా శారీరక భద్రత మాత్రమే కాదు భావోద్వేగ మద్దతు కూడా అవసరం. పిల్లలను మానసికంగా బలంగా మార్చడం తల్లిదండ్రుల బాధ్యత అని చాణక్య నీతి చెబుతోంది. తండ్రి కూతురి భావాలను విస్మరిస్తే, ఆమె మానసికంగా బలహీనంగా మారవచ్చు. కనుక తండ్రి కూతురితో సమయంగడపడమే కాదు.. ఆమె మాట విని.. ఆమె భావాలను అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా తన తండ్రి తనతో ఉన్నాడని కుమార్తె భావించినప్పుడు.. ఆమె ఎటువంటి పరిస్థితి ఏర్పడినా భయపడకుండా దైర్యంగా, దృఢంగా నిలబడగలుగుతుంది

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us