AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈశాన్య మూలలో ఇవి ఉంటే మీ ఇంట సిరుల పంట..అపార ధనలాభం!

ఈశాన్య మూలలో ప్రశాంతమైన చిత్రాలు, ప్రతిమలు ఉంచుకోవాలి. బుద్దుడి బొమ్మ లేదా ప్రశాంతతను సూచించే చిత్రాలు ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. అలాగే, ఇంటి ఈశాన్య మూలలో మనీప్లాంట్‌ను ఉంచడం కూడా చాలా మంచిది. ఆరోగ్యకరమైన మొక్కలను ఈశాన్యంలో ఉంచడం వల్ల పాజిటివ్ శక్తి పెరుగుతుంది.

ఈశాన్య మూలలో ఇవి ఉంటే మీ ఇంట సిరుల పంట..అపార ధనలాభం!
Northeast Corner
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2025 | 10:54 AM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిక్కుకీ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే, ఏ నిర్మాణానికైనా ఈశాన్యం చాలా పవిత్రమైన దిశ అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. తూర్పు, ఉత్తరం కలిసే చోటు ఈశాన్యం అవుతుంది. ఇంటికి ఈశాన్య మూలలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం, దేవుడి చిత్రపటాలను ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిశతో ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం, ఆనందం, సంపద ముడిపడి ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈశాన్య దిక్కులో కొన్ని వస్తువులు ఉంచితే అపార ధనలాభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

ఈశాన్య మూలలో దేవుడి చిత్రపటాలు ఉంచడం, దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే, రాగి చెంబులో నీటిని పోసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేయండి. ఇందులో మామిడి ఆకు వేసి ఈశాన్య మూల ఉంచుకోవటం కూడా ఇంటికి మంచిది. ఇలా ఏర్పాటు చేసిన కలశంలో నీటిని రోజూ మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్యం అనేది నీటికి సంబంధించిన మూల. కాబట్టి, ఈ మూలలో వాటర్ ఫౌంటెన్ లేదా నీటి ఆధారిత వస్తువులు ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఇలా చేస్తే ఆ ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని అంటున్నారు. ఇంటికి ఈశాన్య మూలలో తులసి మొక్కలను నాటుకోవటం కూడా ఉత్తమ ఫలితాలినిస్తుంది. తులసి మొక్క ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తరిమికొడుతుంది. అలాగే, ఇంటి ఈశాన్య మూలలో వాస్తు పిరమిడ్‌లను ఉంచడం వల్ల వాస్తు దోషాలను నివారిస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటికి ఈశాన్య మూల స్వస్తిక్‌ లేదా ఓం చిహ్నాలను గీయండి. ఇవి ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈశాన్య మూలలో ప్రశాంతమైన చిత్రాలు, ప్రతిమలు ఉంచుకోవాలి. బుద్దుడి బొమ్మ లేదా ప్రశాంతతను సూచించే చిత్రాలు ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. అలాగే, ఇంటి ఈశాన్య మూలలో మనీప్లాంట్‌ను ఉంచడం కూడా చాలా మంచిది. ఆరోగ్యకరమైన మొక్కలను ఈశాన్యంలో ఉంచడం వల్ల పాజిటివ్ శక్తి పెరుగుతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..