AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాకింగ్ కంటే మెట్లు ఎక్కితేనే ఎక్కువ లాభాలు తెలుసా..?

దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. మెట్లు ఎక్కడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఎముకల బలంరోజూ కాసేపు మెట్లు ఎక్కితే ఎముకలు బలంగా మారతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

వాకింగ్ కంటే మెట్లు ఎక్కితేనే ఎక్కువ లాభాలు తెలుసా..?
Climbing Stairs
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2025 | 8:43 AM

Share

ప్రస్తుత కాలంలో మనిషి శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. అందివచ్చిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని బద్దకానికి బానిసలుగా మారుతున్నారు. గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లతో కుస్తీ పడుతూ అనేక రకాల రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ప్రతి రోజు కొంతసమయం పాటు ఎక్సర్‌ సైజులు, వాకింగ్‌, రన్నింగ్, యోగా వంటివి అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, వాకింగ్ చేయడానికి సరైన సమయం అవసరం. కానీ, బిజీగా ఉండేవారికి మెట్లు ఎక్కడం మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు. దీనివల్ల రన్నింగ్, వాకింగ్ కంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని చెబుతున్నారు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

మెట్లు ఎక్కడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారను. మెట్లు ఎక్కడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ప్రతీరోజు 6 నిమిషాల పాటు మెట్లు ఎక్కితే శరీరంలోని కొవ్వు15శాతం వరకు తగ్గిపోతుందట. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెబుతున్నారు. అంతేకాదు.. మెట్లు ఎక్కడం ద్వారా లోయర్ బాడీ కండరాలు బలంగా, ఫిట్‌గా తయారవుతాయి. దీనివల్ల మజిల్స్ టోనింగ్ బాగా జరుగుతుంది. ఫిట్‌గా కనిపిస్తారని అంటున్నారు.

బరువు తగ్గాలనుకునేవారు మెట్లు ఎక్కడం మంచి అలవాటు. రోజూ మూడు ఫ్లోర్లు మెట్లు ఎక్కడం ద్వారా కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో బరువు అదుపులో ఉంటుంది. మెట్లు ఎక్కడం ద్వారా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా హృదయానికి రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. మెట్లు ఎక్కడం ద్వారా శ్వాస ఎక్కువగా తీసుకుంటారు. దీంతో ఊపిరితిత్తులు గాలి తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

లేదుమెట్లు ఎక్కడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే వ్యాయామం ఇది. రోజూ కనీసం మూడు ఫ్లోర్లు ఎక్కడం ద్వారా మంచి వ్యాయామం అవుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ కాసేపు మెట్లు ఎక్కడం మంచిది. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. మెట్లు ఎక్కడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఎముకల బలంరోజూ కాసేపు మెట్లు ఎక్కితే ఎముకలు బలంగా మారతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..