AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro Rail : వీడెవడండీ బాబు.. పెళ్లాం మీద కోపంతో మెట్రో రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. వీడియో వైరల్

భార్యతో విడాకులు తీసుకున్న ఒక వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తట్టుకోలేని కోపంతో అతడు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డాడు. కోపంతో రగిలిపోతున్న అతడు ఏకంగా కదులుతున్న రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రయాణికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. ఈ షాకింగ్ ఘటన సౌత్ కొరియాలోని సోల్ నగరంలో మే 31న చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే..

Metro Rail : వీడెవడండీ బాబు.. పెళ్లాం మీద కోపంతో మెట్రో రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. వీడియో వైరల్
man sets fire to moving train
Jyothi Gadda
|

Updated on: Jun 29, 2025 | 12:24 PM

Share

భార్యతో విడాకులు తీసుకున్న ఒక వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తట్టుకోలేని కోపంతో అతడు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డాడు. కోపంతో రగిలిపోతున్న అతడు ఏకంగా కదులుతున్న రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రయాణికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. ఈ షాకింగ్ ఘటన సౌత్ కొరియాలోని సోల్ నగరంలో మే 31న చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే..

సౌత్ కొరియాలోని సోల్ నగరానికి చెందిన 67 ఏళ్ల వాన్ అనే వ్యక్తి, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో మే 31న అతడు సోల్ సబ్‌వే లైన్ 5లో పెట్రోల్ బాటిల్‌తో రైలు ఎక్కాడు. రైలు బయలుదేరి వేగంగా ముందుకెళ్తుండగానే ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ రైలులో పోసి నిప్పంటించాడు. రైలు అప్పటికే మపో స్టేషన్ దాటి యోదయునారూ స్టేషన్ వైపు వేగంగా వెళ్తోంది. రైల్లో జరిగిన ఈ షాకింగ్ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. రైలు బోగీల్లో ప్రాణ భయంతో పరుగులు తీశారు. తలుపుల్ని తన్నుకుంటూ బయటపడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి మంటలతో గాయాలు కాగా, మరికొంతమంది పొగ వలన అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైలులోని సీసీటీవీల్లో రికార్డు అవ్వటంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒక వ్యక్తి కొంత ద్రవాన్ని పోసి మెట్రో రైలుకు నిప్పంటిస్తున్నట్లు కనిపిస్తుంది. సుమారు 160–400 మంది ప్రయాణికులు ఉన్న ఈ ట్రైన్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది నిజంగా అదృష్టంగా భావించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, చాలా మంది తమ స్పందనలను వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న భార్య దృష్టిని ఆకర్షించడానికి ఎవరైనా ఇలా చేస్తారా? ఇతను ఎలాంటి వ్యక్తి? రెస్క్యూ పని ఆలస్యం అయి ఉంటే, చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారని ప్రజలు మండిపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..