Father’s Day 2024: మీకు ఎప్పుడూ అండగా ఉండే నాన్నను ఇలా సర్‌ప్రైజ్ చేయండి..

|

Jun 15, 2024 | 1:12 PM

'ఫాదర్స్ డే' ప్రపంచంలో తండ్రి ఇచ్చే భరోసా ఇంకెవరూ ఇవ్వలేరు. అమ్మ నవమాసాలు మోసి కని పెంచినా.. మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేది మాత్రం తండ్రే. ఆయన మీతో కఠినంగా ఉన్నా.. మీపై ఉండే ప్రేమ మాత్రం అనంతం అని చెప్పొచ్చు. మీ ప్రతీ అడుగులో.. మీ ప్రతి విషయంలో.. ఎంత వరకు ఎంతో స్వేచ్ఛ ఇవ్వాలో మీ నాన్నకు బాగా తెలుసు. తల్లి మందలించినా.. తండ్రి మాత్రం మీకు ఎప్పుడూ..

Fathers Day 2024: మీకు ఎప్పుడూ అండగా ఉండే నాన్నను ఇలా సర్‌ప్రైజ్ చేయండి..
Fathers Day 2024
Follow us on

‘ఫాదర్స్ డే’ ప్రపంచంలో తండ్రి ఇచ్చే భరోసా ఇంకెవరూ ఇవ్వలేరు. అమ్మ నవమాసాలు మోసి కని పెంచినా.. మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేది మాత్రం తండ్రే. ఆయన మీతో కఠినంగా ఉన్నా.. మీపై ఉండే ప్రేమ మాత్రం అనంతం అని చెప్పొచ్చు. మీ ప్రతీ అడుగులో.. మీ ప్రతి విషయంలో.. ఎంత వరకు ఎంతో స్వేచ్ఛ ఇవ్వాలో మీ నాన్నకు బాగా తెలుసు. తల్లి మందలించినా.. తండ్రి మాత్రం మీకు ఎప్పుడూ సపోర్ట్‌గానే నిలుస్తాడు. అమ్మ ప్రేమను చూపించినట్లుగా.. నాన్న చూపించలేడు. కాస్త లేటుగా అయినా సరే.. మీకు కలలన్నీ నేరవేరుస్తాడు. మీకు ఏదైనా కావాలంటే నేరుగా కాకుండా అమ్మ ద్వారా అందిస్తాడు. మీ మీద ప్రేమను చూపిస్తే.. ఎక్కడ మీరు మాట వినకుండా పోతారని.. తాను కఠినంగా ఉన్నట్లు నటిస్తాడు. అలాంటి నాన్న ప్రత్యేకంగా ఓ డేను కేటాయించారు. ఈ ఫాదర్స్ డే రోజున మీ ఫాదర్స్‌కి ఎలాంటి సర్ ప్రైజ్‌ ఇవ్వాలో తెలీడం లేదా. ఇదిగో మీకోసమే కొన్ని సర్ ప్రైజ్‌లు.

పర్స్:

పర్సులకు నాన్నలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. నాన్నలకు పర్సులు అంటే చాలా ఇష్టం. అలా మీ డాడ్‌కి కూడా పర్సులు అంటే చాలా ఇష్టం అయితే మీరు కూడా పర్సును గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.

స్మార్ట్ వాచ్:

మీరు గమనిస్తూ ఉంటే నాన్నలు ఎక్కువగా వాచ్‌లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొంత మందికి ఇష్టం. మరికొంత మంది అంతగా పట్టించుకోరు. అలా మీ తండ్రికి వాచ్ అంటే ఇష్టం ఉంటే మీరు వాచ్‌ని బహుమతిగా ఇవ్వొచ్చు

ఇవి కూడా చదవండి

బయట వెకేషన్‌కు తీసుకెళ్లండి:

మీకే కాదు మీ నాన్నలకు కూడా బయట తిరగాలని ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కోరికలను చంపుకుంటూ ఉంటాడు. ఈ ఫాదర్స్‌ డే రోజు ఆయన్ని రెస్టారెంట్ లేదా హోటల్‌కు బయటకు తీసుకెళ్లండి. దీంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఫోటో బుక్:

మీరు అంటే మీ నాన్నకు చాలా ఇష్టం. అలా మీ నాన్న మీతో సరదాగా గడిపిన ఫొటోలను ఓ బుక్ మాదిరిగా చేసి.. ఓ అల్బమ్ క్రియేట్ చేసి గిఫ్ట్ ఇవ్వండి. వాటిని చూడగానే మీ నాన్న మొహంలో ఓ చిరునవ్వు వస్తుంది.

ఇష్టమైనవి చేయండి:

మీ నాన్నకు కూడా చాలా రకాల ఇష్టాలు ఉంటాయి. కానీ పిల్లలు వచ్చాక ప్రతీ తల్లితండ్రులు తమ ఆశల్ని, కోరికల్ని చంపేసుకుని.. మీ కోసం మాత్రమే జీవిస్తారు. కాబట్టి మీ నాన్నకు ఇష్టమైనవి ఏంటో అవి చేయండి. సరదాగా మీ నాన్నతో సమయం గడపండి.