AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memory Loss: అన్నీ మర్చిపోతున్నారా.. అసలు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

కొలెస్ట్రాల్స్ అంటే శరీరంలో ఉండే ఓ కొవ్వు కణజాలం. ఇది శరీరానికి ఎంతో అవసరం. కానీ మోతాదు మించితే దీని కారణంగా గుండె ఎంతలా దెబ్బతింటుందో అదే స్థాయిలో మెదడు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనలో తెలుసుకున్నారు. ఇంతకీ ఈ చెడు కొలెస్ట్రాల్స్ కి మెదడుతో ఏం పని అని అనుకుంటున్నారా?.. శరీరంలోని కొలెస్ట్రాల్స్ మన శరీరంలోని మెదడు నిర్వహణ కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది.

Memory Loss: అన్నీ మర్చిపోతున్నారా.. అసలు కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు
Memory Problem
Bhavani
| Edited By: |

Updated on: Feb 09, 2025 | 8:52 PM

Share

కొలెస్ట్రాల్స్ అంటే శరీరంలో ఉండే ఓ కొవ్వు కణజాలం. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. కానీ మోతాదు మించితే దీని కారణంగా గుండె ఎంతలా దెబ్బతింటుందో అదే స్థాయిలో మెదడు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనలో తెలుసుకున్నారు. ఇంతకీ ఈ చెడు కొలెస్ట్రాల్స్ కి మెదడుతో ఏం పని అని అనుకుంటున్నారా?.. శరీరంలోని కొలెస్ట్రాల్స్ మన శరీరంలోని మెదడు నిర్వహణ కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. ఇది ఈ వ్యవస్థను బలహీనపరిచి చివరకు అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది. అధిక మొత్తంలో చెడు కొవ్వు చేరితే అది శరీరంలోని ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థను ప్రభావితం చేయడం మొదలుపెడుతుంది. అది విడుదల చేసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా మెదడు గుర్తుంచుకునే శక్తిని కోల్పోతుంది.

ఆడవారిలోనే ఎక్కువ..

ఏ కణాలైతే మనకు గుర్తుంచుకునే శక్తిని కలిగిస్తాయో అవే కణాలు వయసు పెరుగుతున్న కొద్దీ ఆల్జీమర్స్ కి కారణమవుతాయి. చిన్న కణాలు అందించే ఆరోగ్య ప్రయోజనాలు పెద్ద కణాలు ఇవ్వలేకపోగా తిరిగి మెదడుపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయి. అయితే, మహిళల్లో మెనొపాజ్ వచ్చే ముందు ఈ కొలెస్ట్రాల్ కణాల సంఖ్యతోపాటు వాటి పరిమాణం పెరగడంతో పాటు ప్రయోజనాలు తగ్గుతున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలోనూ తేలింది. దీంతో వారిలో ఆల్జీమర్స్ ముప్పు పొంచి ఉంది.

ఇలా తగ్గించుకోవచ్చు..

ఈ సమస్యను ఆరోగ్యకరమైన జీవనశైలితో జయించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంచి డైట్ తీసుకోవాలి. పోషకాలుండే ఆహారం వల్ల మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మద్యపానం, సిగరెట్ అలవాట్లు మతిమరుపును పెంచుతాయి. వాటికి దూరంగా ఉండాలి. తగిన మోతాదులో నీటిని తీసుకోవాలి.

క్యాలిక్యులేటర్ వద్దు..

దీంతో పాటు మెదడును యాక్టివ్ గా ఉంచుకునేలా చూసుకోవాలి. చిన్న విషయాలకు కూడా క్యాలిక్యులేటర్ తీయకుండా మెదడుకు పనిపెట్టాలి. పజిల్స్ వంటివి సాల్వ్ చేయాలి. పుస్తక పఠనం వల్ల కూడా మెదడు పనితీరును క్రమంగా మెరుగుపరుస్తుందని తేలింది. అలాగే రోజూవారి జీవితంలో శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. చురుకైన నడక, ఈత, యోగా వంటివి చేస్తుండాలి.

తగ్గినా సమస్యే..

ఒకవేళ కొలెస్ట్రాలు మరీ తక్కువ స్థాయిలో ఉన్నవారిలో కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు పరిశోధనలో తేలింది. ఎందుకంటే ఇవి మెదడు కార్యకలాపాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఇప్పుడే పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని నిర్ధారించలేమని వారు తెలిపారు.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి